మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డు ల రారాజు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ లో 100 సెంచరీ లు చేసి, 100 వ సెంచరీ చేసి ఈ రోజు కు 13 ఏళ్ళు
సరిగా ఇదే రోజు అంటే మార్చ్ 16, 2012 లో బాంగ్లాదేశ్ పై సచిన్ ఈ సెంచరీ సాధించాడు. 147 బంతుల్ల 114 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి
అంతర్జాతీయ క్రికెట్ లో 100 సెంచరీ లు చేసిన మొదటి క్రికెటర్ సచిన్ టెండూల్కర్. 100 వ సెంచరీ చేయడానికి ఒక సంవత్సరం పట్టింది. సచిన్ సెంచరీ చేసినా ఈ మ్యాచ్ లో భారత జట్టు ఓడిపోయింది
51 ఏళ్ళ వయసులో కూడా ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో సచిన్ అదరగొడుతున్నాడు. ఈ రోజు యింతేనాషనల్ మాస్టర్ లీగ్ మొదటి సీజన్ ఫైనల్ మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఇండియా మాస్టర్స్, వెస్ట్ ఇండీస్ మాస్టర్స్ తో తలపడనుంది. ఇండియా మాస్టర్స్ కు సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు బీసీసీఐ ఎక్స్ లో పోస్ట్ చేసింది

