పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ హారర్ చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘కల్కి’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ (Prabhas) నుంచి రానున్న సినిమా ఇదే కావడంతో భారీ హైప్ నెలకొంది. హార్రర్ కామెడీ జోనర్లో వస్తున్న రాజాసాబ్ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్టు ప్రకటించగా.. ప్రస్తుతం సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఈ ఏడాది ఆగస్టు రెండో వారంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
నిజానికి ఈ సినిమా చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ మూవీ టీజర్ గురించి కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. అలాగే ఈ సినిమాలో ఇంకా మూడు సాంగ్స్ షూట్ చేయాల్సి ఉందని, కానీ కథానాయికలు మాళవిక మోహన్, నిధి అగర్వాల్ డేట్స్ లేకపోవడంతో షూటింగ్ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. దింతో పాటుగా ఈ సినిమాకు బడ్జెట్ సమస్యలు ఉన్నాయని తెలుస్తోంది. గతేడాది వరుస ప్లాపుల కారణంగా చిత్ర నిర్మాణ సంస్థ ఇబ్బందుల్లో ఉందని అందుకే ఈ సినిమా అలస్యంమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, హారర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ,మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏదేమైనా ‘ది రాజా సాబ్’ (Rajaa Saab) సినిమా వాయిదా పడిందన్న సమాచారంతో ప్రభాస్ (Prabhas) అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

