రోష‌న్ నయా మూవీ.. ‘ఛాంపియన్’ గ్లింప్స్ రిలీజ్

by | Mar 13, 2025 | సినిమా

టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ (Roshan).. నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందD లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడన్న సంగతి తెలిసిందే. చాలా రోజుల విరామం తర్వాత రోషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఛాంపియన్’. ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను స్వప్న సినిమా (Swapna Cinema) , ఆనంది ఆర్ట్స్‌ క్రియేషన్స్, కాన్సెప్ట్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతంతో పాటు బీజీఎం అందించనున్నాడు. మార్చి 13న రోషన్‌ బర్త్ డే కానుకగా ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్‌ చూస్తుంటే ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రోషన్ లుక్ ఆకట్టుకుంటుంది.యాక్షన్ మోడ్లో కూడా చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇక ఫుట్‌బాల్ బ్యాగ్డ్రాప్ లో రానున్న ఈ మూవీలో రోష‌న్ రెండు కొత్త లుక్స్ లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో ఒక్కటి 90స్ బ్యాగ్డ్రాప్ లుక్ కాగా. ఇంకోటి అల్ట్రా స్టయిలిష్ లుక్ అని తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ ప్రకటించారు.

ఇదిలాఉంటే.. 2016లో ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాతో రోషన్ హీరోగా అరంగేట్రం చేయగా.. మొదటి సినిమాతోనే బెస్ట్ మేల్ డెబ్యూ అవార్డు అందుకున్నాడు. ఐదేళ్ల విరామం తర్వాత 2021లో ‘పెళ్లి సందడి’ సినిమాతో రోషన్ (Roshan) మళ్ళీ తెరపై మెరిశాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. హీరోయిన్ గా శ్రీలీలకు తొలి తెలుగు సినిమా ఇది. ఈ సినిమా తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ అయిపోగా అదే మూవీలో హీరోగా చేసిన రోషన్ ఇన్నాళ్లకు మరో సినిమా ప్రారంభించాడు. దింతో పాటుగా రోషన్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘వృషభ’లో కీలకపాత్రను పోషించబోతున్న సంగతి తెలిసిందే.