ఎయిర్ టెల్, జియో ల మధ్య శాటిలైట్ ఇంటర్నెట్ పోటీ

by | Mar 13, 2025 | వార్తలు

శాటిలైట్ సహాయంతో తెలివిజన్ కార్యక్రమాలే కాదు ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు.  దేశంలో ఎలాంటి మారుమూల ప్రాంతమైన వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయం మన భారత దేశంలో  కూడా లభించనుంది. 

ఇందుకోసం, టెలికాం దిగ్గజ సంస్థలైన ఎయిర్ టెల్, జియో నెట్వర్క్ లు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.  ఇప్పటికే స్పేస్ ఎక్స్ కు చెందిన స్టార్ లింక్ 100 దేశాల్లో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది

అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది.  ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు  మనదేశానికి రావాలంటే అమెరికా కు చెందిన ఈ స్టార్ లింక్ (ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్) కు, మన హోమ్ మినిస్ట్రీ సెక్యూరిటీ పరంగా అనుమతులు ఇవ్వాలి. అవి ఇచ్చాకే ఈ సేవలు మన దేశంలో ప్రారంభమవుతాయి. 

అయితే మొబైల్ హాట్ స్పాట్ లాగా ఎక్కడ పడితే అక్కడకు ఈ సదుపాయాన్ని తీసుకెళ్లే అవకాశం ఉండదు.  మన ఇంట్లో రౌటర్ సాయంతో వాడే వైఫై కనెక్షన్ లాంటిదే.  స్టార్ లింక్ ప్రకారం డౌన్ లోడ్ స్పీడ్ 25-220 ఎంబీపీస్, అప్ లోడ్ స్పీడ్ 5-20 ఎంబీపీస్.

ఈ ఇంటర్నెట్ ఖర్చు అధికంగా ఉండవచ్చు.  మధ్య తరగతి వాళ్ళు ఎక్కువగా ఉండే మన దేశంలో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ వలన ఎయిర్ టెల్, జియో నెట్ వర్క్ వాళ్లకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నా, వినియోగదారుడు చూసేది మాత్రం ఖర్చు ఎంత అన్నది మాత్రమే.

ప్రస్తుతం మన దేశం లో నగరాలలో 100 ఎమ్ బి పి ఎస్ డేటా స్పీడ్ కు నెలకు అయ్యే ఖర్చు 800-1000 రూపాయలు.  జియో నెట్ వర్క్ వారు తక్కువ ధరలకు ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించవచ్చు.  మరి ఎయిర్ టెల్ ఈ విషయంలో జియో నెట్ వర్క్ తో పోటీ పడగలదా లేదా అనే విషయం తెలియాలి