క్లాస్‌ డైరెక్టర్‌తో ఎనర్జీటిక్‌ స్టార్‌.. బాక్సాఫీస్ వ‌ద్ద విధ్వంసమే

by | Mar 13, 2025 | సినిమా

న‌టుడు నాగ చైత‌న్య, సాయి ప‌ల్ల‌వి జంట‌గా తెర‌కెక్కిన చిత్రం తండేల్. ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అర‌వింద్ నిర్మించాడు. ఫిబ్రవరి 7న విడుదలైన ఈచిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి నాగచైతన్య కెరీర్‌లోనే మంచి కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా నిలిచింది. అయితే ‘తండేల్‌’తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ చందూ మొండేటి తదుపరి చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్థం చేసిన చందూ మొండేటి ఇటీవలే ఆయనకు కథ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక చందూ చెప్పిన కథతో పాటుగా తన క్యారెక్టర్ ను డిజైన్ చేసిన తీరుకు ఇంప్రెస్ అయిన సూర్య వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే మూవీ పట్టాలెక్కడం కాస్త ఆలస్యంగా కనిపిస్తోంది.

ఇంతలోపు గీతా ఆర్ట్స్‌ బ్యానర్ లో చందూ మొండేటి (Chandoo Mondeti) ఓ సినిమా ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ‘కార్తికేయ 2’, ‘తండేల్‌’ వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ల తర్వాత, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మరో సినిమా చేయడానికి డైరెక్టర్ చందూ కమిట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఎనర్జీటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని (Ram Pothineni) కోసం ఓ యాక్షన్ థ్రిల్లర్ స్క్రిప్ట్ ను చందూ మొండేటి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే రామ్ ను కలిసి చందూ ఈ పవర్ ఫుల్ స్టొరీని వినిపించారట. రామ్ కు కూడా ఈ కథ బాగా నచ్చిందని తెలుస్తున్నది. ఈ వేసవి నుంచే వీరిద్దరి కాంబోలో సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్టు ఫిల్మ్‌ వర్గాల టాక్‌. ఈ సినిమానీ గీతా ఆర్ట్స్‌ సంస్థ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో నిర్మించనున్నట్లు సమాచారం.