‘పెళ్లికాని ప్రసాద్‌’ ట్రైలర్‌: నవ్వులే నవ్వులు

by | Mar 13, 2025 | సినిమా

టాలీవుడ్ నటుడు సప్తగిరి కథానాయకుడుగా, అభిలాష్‌రెడ్డి గోపిడి దర్శకత్వంలో రూపొందుతున్న వినోదాత్మక చిత్రం ‘పెళ్లికాని ప్రసాద్‌’. కె.వై.బాబు, భానుప్రకాష్‌ గౌడ్‌, సుక్కా వెంకటేశ్వర్‌గౌడ్‌, వైభవ్‌రెడ్డి ముత్యాల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రియాంక శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్‌చంద్ర సంగీతం అందిస్తున్నారు.

మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్ ఇటీవల రిలీజ్ అవగా అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్‌ తాజాగా ‘పెళ్లికాని ప్రసాద్‌’ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.