ఇటీవలే జరిగిన 97 వ ఆస్కార్ అవార్డు లలో, అమెరికన్ కామెడీ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనోరా’ చిత్రానికి అవార్డుల పంట పండింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అనోరా మూవీ అవార్డులను దక్కించుకుంది.
సీన్ బేకర్ ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు, ఎడిటర్, నిర్మాత. మైకీ మాడిసన్, ఈ అనోరా సినిమాలో ఆనోరా మిఖీవా అనే పాత్రలో నటించింది
అయితే ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చారు. అది దృష్టిలో పెట్టుకుని లాగ్ ఇన్ అవ్వండి
అనేక ఆస్కార్ అవార్డు లు గెలుచుకున్న ఈ ‘అనోరా’ చిత్రం ఈ మార్చ్ 17 నుండి జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. అసలు ఎందుకు అన్ని ఆస్కార్ అవార్డు లు వచ్చాయి అని తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ సినిమా చూడండి
ఒక సెక్స్ వర్కర్, ప్రజా జీవితంలోకి వచ్చి, సాధారణ జీవితం గడపడానికి వచ్చిన ఒక యంగ్ గర్ల్ కధ, ఈ అనోరా. తాను ఎలాంటి సమస్యలు ఫేస్ చేసింది. చివరకు తన జీవితం ఎక్కడ మొదలైందో, అక్కడికే వచ్చిందా అనే అంశాలు ఆసక్తిని కలిగిస్తాయి.
ఆనోరా, ఉత్తమ సినిమా అవార్డు గెలుచుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి

