అల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ షిప్ లో పి వి సింధు మొదటి రౌండ్లోనే కొరియా కు చెందిన కిమ్ గా యున్ చేతిలో ఓడిపోయింది.
హోరా హోరీగా సాగిన మొదటి గేమ్ లో పి వి సింధు 21-19 తో విజయం సాధించింది. ఆ తరవాతి రెండు గేమ్ లలో కిమ్ గా యున్ చేతిలో పి వి సింధు 21-13, 21-13 ల తో ఓడిపోయింది
మొదటి గేమ్ లో పోరాడిన సింధు (P V Sindhu) , ఆ తరవాత తేలిపోయింది. ప్రత్యర్థి ఆత్మ విశ్వాసం ముందు తలవంచక తప్పలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న పి వి సింధు మొదటి రౌండ్ లో ఓడిపోవడం చాలా బాధాకరం.
ఇప్పటివరకు అల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ షిప్ ను 1980 లో ప్రకాష్ పదుకునే, 2001 లో పుల్లెల గోపీచంద్ లు మాత్రమే గెలిచారు.

