గతేడాది టిల్లు స్క్వేర్‌తో ఫ్యాన్స్‌ను మెప్పించిన సిద్ధు జొన్నలగడ్డ మరోసారి ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జాక్’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) ఓ డిఫరెంట్ స్టోరీని సిద్ధం చేశారట. ఇందులో సిద్ధూ సరసన యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అచ్చు రాజమణి స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఏప్రిల్ 10 ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుండగా.. ఇటీవల ఈ మూవీ నుంచి సాలిడ్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆద్యంతం ఆసక్తిగా ఉన్న టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. కొంతకాలంగా తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో యువతను ఆకట్టుకుంటున్న సంగీత దర్శకుడు సామ్ సీఎస్ ‘జాక్’ మూవీకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించనున్నాడు. ఇటీవల ‘పుష్ప 2’కు సామ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోరు సినిమాలో హైలైట్ గా నిలిచింది. ‘పుష్ప-2’తో పాటుగా ‘సుజల్-2’లోని తన పనితనం కారణంగా ఇప్పుడు ‘జాక్’లో అవకాశం రావడంపై సామ్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే జాక్ మూవీకి కూడా సామ్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తాడంటూ సిద్ధు (Siddu) ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ‘ఫ్లాబో నెరుడా’ అనే తొలి గీతాన్ని విడుదల చేయగా అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అచ్చు రాజమణి స్వరపరచిన ఈ గీతాన్ని వనమాలి రచించారు. బెన్నీ దయాల్ ఆలపించారు. కాగా, ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

