ఫ్యాన్స్​కు అల్లు అర్జున్ ‘డబుల్’ ట్రీట్

by | Mar 13, 2025 | సినిమా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయనున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో హై యాక్షన్‌ మూవీ తెరకెక్కించనున్నట్లు తెలుస్తుండగా.. అట్లీ అల్లు అర్జున్ కోసం చాలా స్పెషల్ గా ఈ పాత్రని డిజైన్ చేస్తున్నాడట. దీని ప్రకారం ఈ చిత్రం ఇంటర్నేషనల్ లెవెల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో సన్‌ పిక్చర్స్‌ (Sun Pictures) ఈ సినిమాను నిర్మించనుండగా.. ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్ తో పాటుగా ఐదుగురు హీరోయిన్స్‌ ఉంటారని, వీరిలో ముగ్గురు ఫారెన్ హీరోయిన్లు ఉండనున్నారని అంటున్నారు. అయితే ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది.

ఇందులో అల్లు అర్జున్‌(Allu Arjun) డ్యూయల్‌ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే బన్నీ కెరీర్‌లో ఇదే ఫస్ట్ డ్యూయల్‌ రోల్‌ మూవీ అవుతుంది. ఈ సినిమా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండనుండగా.. ఇందులో అల్లు అర్జున్ ఓ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఇప్పటికే అల్లు అర్జున్ విదేశాలకు వెళ్ళి మరీ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమా బడ్జెట్, పారితోషికం దగ్గరే సమస్య వచ్చి పడిందని తెలుస్తోంది. ఈ మూవీకి రూ.600 కోట్ల బడ్జెట్ కేటాయించగా.. రెమ్యునరేషన్ కింద తనకే రూ.100 కోట్లు ఇవ్వాలని అట్లీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయని, ఏదో ఒక విషయం తేలితో త్వరలో ఈ మూవీ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇక పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రలో తమిళ స్టార్ హీరో అమరన్ ఫేమ్ శివకార్తికేయన్ నటించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అట్లీ ఈ మూవీలో శివకార్తికేయన్ పాత్రలో అద్భుతంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. మునుపెన్నడూ లేని రీతిలో శివకార్తికేయన్ మేకోవర్ ఇందులో ఉండనుందని తెలుస్తోంది.