టాలీవుడ్ లో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో ఒకరు అక్కినేని అఖిల్(Akhil). గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన ఏజెంట్ మూవీ బాక్సాఫీస్ వద్ద వద్ద నిరాశ పరిచింది. ఇప్పటివరకు నటించిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో.. అఖిల్ తదుపరి సినిమా ఏంటి అని ఎదురుచూస్తున్న వారి కోసం కొత్త అప్‌డేట్ తెరపైకి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ కిరణ్ మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ (Akhil) హీరోగా ఓ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ మూవీకి ‘లెనిన్’ అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సైలెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇది చిత్తూరు రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చిత్తూరులోని భారతం మెట్ట ప్రాంతంలో ఈ మూవీ అగ్రభాగం చిత్రీకరణ జరుపుకోనుంది.
కాగా, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే మొదలవ్వగా.. కొత్త షెడ్యూల్ ఈ నెల 14న హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని, దాదాపు మూడు వారాల పాటు చిత్రీకరణ కొనసాగుతుందని సమాచారం. భారీ బడ్జెట్ తో అన్నపూర్ణ స్డూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు అఖిల్ ఏజెంట్ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ ఈ సినిమాను మార్చి 14 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించింది.

