చిరంజీవి అభిలాషకు 42 ఏళ్ళు – ఉరి శిక్ష రద్దు పై చిరంజీవి సినిమా
1983 లో చిరంజీవి హీరో గా, క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై, కె ఎస్ రామారావు నిర్మించిన చిత్రం ‘అభిలాష’. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు ఎ కోదండరామి రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. 1983, మార్చ్ 11 న ఈ సినిమా విడుదలైంది
చిరంజీవి కి జతగా రాధిక నటించగా, రావు గోపాల్ రావు, గొల్లపూడి మారుతీ రావు లు కీలక పాత్రలలో కనిపిస్తారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకూర్చారు ఈ అభిలాష చిత్రానికి
యండమూరి వీరేంద్రనాథ్ రచించిన అభిలాష అనే నవల ఆధారంగా ఈ అభిలాష చిత్రాన్ని అదే పేరుతో నిర్మించారు. ఈ సినిమా స్క్రీన్ ప్లే కు వీరేంద్రనాధ్, సత్యమూర్తి, సత్యానంద్ లు పని చేశారు
భారత దేశంలో ఉరి శిక్షను రద్దు చేయాలి అనే ఒక యువ లాయర్ కధ ఈ సినిమా. అయితే, ఉరి శిక్షను రద్దు చేయాలనుకునే ఈ యువ లాయర్ అనుకోని పరిస్థితులలో ఒక హత్య కేసులో ఇరుక్కోవడంతో అతనికి ఉరి శిక్ష పడుతుంది.
ఏ ఉరి శిక్ష ను రద్దు చేయాలనుకున్నాడో అదే ఉరి శిక్ష తనకు పడడంతో ఆ యువ లాయర్ ఏం చేశాడు. ఉరి శిక్షనుండి తప్పించుకోగలిగాడా, నిజంగా ఉరి శిక్షను రద్దు చేయగలిగాడా అనేది మిగతా చిత్ర కధ
యండమూరి వీరేంద్రనాధ్ రాసిన ఈ నవల కధ కొన్ని అమెరికన్ చిత్రాలకు దగ్గర పోలిక ఉంది. చిరంజీవి, కె ఎస్ రామారావు, కోదండరామి రెడ్డి, ఇళయరాజా, యండమూరి వీరేంద్రనాధ్ కాంబినేషన్ లో వచ్చిన ఛాలెంజ్, రాక్షసుడు చిత్రాలు కూడా సూపర్ హిట్ అయినవే
అప్పట్లో ఈ సినిమా పాటలు యువతరాన్ని ఉర్రుతలూగించాయి. ముఖ్యంగా నవ్వింది మల్లె చెండు పాట ఒక ఊపు ఊపింది. ఇప్పటికి ఈ పాట టెలివిజన్ షోల లో వినిపిస్తూ ఉంటుంది. ఈ పాటతో పాటు బంతి చేమంతి, సందె పొద్దుల కాడ పాటలు సూపర్ హిట్ అయ్యాయి
చిరంజీవి కి మెగా స్టార్ స్టేటస్, విపరీతమైన మాస్ ఫాలోయింగ్ రావడానికి యాక్షన్ చిత్రాలే కాదు ఇలాంటి ఆలోచింపచేసే చిత్రాలు కూడా. చిరంజీవి ఎన్నుకున్న సబ్జెక్టు లు కూడా పాత్ బ్రేకింగ్ సబ్జెక్టు లు

