‘బాహుబలి-2’ రికార్డ్‌ను బద్దలుకొట్టిన ‘ఛావా’

by | Mar 11, 2025 | సినిమా

బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన తాజా చిత్రం ‘ఛావా'(Chava). ఇందులో ర‌ష్మిక మంద‌న్నా కథానాయికగా న‌టించ‌గా.. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌హరాష్ట్ర యోధుడు ఛ‌త్ర‌పతి శివాజీ మ‌హ‌రాజ్ కొడుకు శంభాజీ మ‌హరాజ్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా వ‌చ్చింది. విక్కీ కౌశ‌ల్ ఇందులో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయ‌న భార్య యెసుబాయ్ పాత్ర‌ను ర‌ష్మిక (Rashmika) మందన్నా పోషించారు. ఇక ఫిబ్ర‌వ‌రి 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. తొలుత హిందీలో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తెలుగు వర్షన్ లో ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ సంస్థ విడుదల చేయగా.. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 10.91 కోట్ల కలెక్షన్స్‌ వసూలు చేసినట్లు సమాచారం.

ఫిబ్రవరి 14న హిందీ వర్షన్‌లో మాత్రమే విడుదలైన ఈ మూవీ తెలుగు డబ్బింగ్‌లో మార్చి 7న రిలీజయింది. అయితే తాజాగా ఈ సినిమా హిందీలో అరుదైన రికార్డ్ సాధించింది. రాజమౌళి- ప్రభాస్ (Prabhas) కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి-2 రికార్డ్‌ను అధిగమించింది. బాహుబలి-2 హిందీలో రూ.510 కోట్ల కలెక్షన్స్ సాధించగా.. ఛావా మూవీ కేవలం హిందీలోనే రూ.516 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ హిస్టరీలైన్ అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన ఆరో చిత్రాంగా నిలిచింది. ఇక ఈ ఏడాది బాలీవుడ్‌లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ఛావా నిలువడమే కాకుండా.. హీరో విక్కీ కౌశల్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి సినిమాగా నిలిచింది