‘పుష్ప’ లొల్లి ఆగేదె లా!

by | Mar 11, 2025 | ప్రగడ టీవీ

పుష్ప-2 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా విడుదలయిన నాటినుండి నేటి వరకు ఏదో ఒకరకంగా వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది.

ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా, ఆ చిత్ర బృందం యొక్క వ్యక్తిగత ఇమేజ్ ని డామేజ్ చేసిన సినిమా ఏదైనా ఉంటె అది పుష్ప మాత్రమే. ఎంతలా ఉంటె సినిమా హిట్ అయ్యింది అని గట్టిగా ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితి   

అసలు పుష్ప చేసిన ఆ లొల్లి ఏందో చూద్దాం

  • ముందుగా పుష్ప సినిమా బెనిఫిట్ షో లకు, టికెట్ రేట్ల పెంపుకు  అనుమతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుని మర్చిపోయాడు మన అల్లు అర్జున్.  పేరు మర్చిపోవడమే కాక గౌరీ నాధ్ అని ఏదో అనడం, మళ్ళీ  దానిని  కవర్ చేసుకునే ప్రయత్నం ఇవన్నీ చూసే వాళ్లకు చాలా కనిపించాయి
  • ఆ తరవాత పుష్ప విడుదలైన ముందు రోజు సంధ్య థియేటర్ కు బెనిఫిట్ షో కు పోలిసుల అనుమతి లేకుండా ర్యాలీ గా రావడం (ఈ విషయం ఇప్పటికి గందరగోళం.  అల్లు అర్జున్ పి ఆర్ టీం, స్ట్రాటజీ టీం అంత గొప్ప టీం మరి)
  • అల్లు అర్జున్ రావడం వలన జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడం, ఆ మహిళ కుమారుడు ఆస్పత్రిలో జేరడం
  • ఇది చిలికి చిలికి గాలివాన అయ్యి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి ఒక రాత్రి జైలులో పెట్టడం
  • అంతే కాకుండా మృతి చెందిన మహిళకు good will gesture కింద ఆర్ధిక సహాయాన్ని ప్రకటిస్తున్నట్లు  అల్లు అర్జున్ ఒక వీడియో విడుదల చేయడం.  అనే పదం యెక్క వాడతారో కూడా తెలియని స్థితిలో అల్లు అర్జున్ ఉన్నాడా…. అయన పి ఆర్, స్ట్రాటజీ టీం, మేనేజర్ అంత గొప్పగా ఉన్నారా
  • ఈ విషయంపై నేషనల్ మీడియా లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని అల్లు అర్జున్ ఏకి పారేయడం.  అల్లు అర్జున్ వ్యాపారం చేస్తున్నాడు. అల్లు అర్జున ఏమైనా దేశానికి ఏమైనా సేవ చేస్తున్నాడా.  అందరు అల్లు అర్జున్ గురించి అడుగుతున్నారు కానీ చనిపోయిన మహిళ గురించి ఎవరు అడగడంలేదు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ మహిళా కుమారుడి గురించి ఎవరు అడగడంలేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేషనల్ మీడియా సాక్షిగా ఉతికి ఆరేశారు.  అల్లు అర్జున్ పరుగు జాతీయ స్థాయిలో కూడా  డామేజ్ అయింది
  • ఆ తరవాత ఇకపై టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షో లు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షి గా ప్రకటించారు.  అంతే కాకుండా, ఈ సంఘటనపై ప్రతిపక్షాలు అడిగిన దానికి, ముఖ్యమంత్రి సమాధానంగా,  అల్లు అర్జున్ పోలీసులకు ముందు సమాచారం ఇవ్వకుండా, ర్యాలీ లా  రావడం వలన, ఒక మహిళ మృతి చెందింది అని అన్నారు
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో మాట్లాడిన దానికి కౌంటర్ గా అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ అల్లు అర్జున్ ఇమేజ్ ని మరింత డామేజ్ చేసింది. ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది. అల్లు అర్జున్ కి ఎవరు సలహా ఇస్తున్నారో వాళ్లకు దండం పెట్టాలి
  • ఇవి కాకుండా ‘ తెలుగు సినిమాని నేను ఎక్కడో పెట్టాలని ఈ సినిమా చేశాను’ అని ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ అహంకారం తో మాట్లాడడం
  • అంతకు ముందు ఆహ ఓ టి టి ప్లేట్ ఫారం లో అహంకారంగా మాట్లాడడం. నేషనల్ అవార్డు ఇప్పటివరకు మన తెలుగు వాళ్లకు ఎవరికి రాలేదు దానికి ఎలాగైనా కొట్టాలని అప్పుడే అనుకున్నాను అన్న అహంకారం
  • పుష్ప వసూళ్లు నిజంగా అంత వచ్చాయా అన్న అనుమానాలు ఇప్పటికి ఉన్నాయి. ఐటీ లెక్కల ప్రకారం పుష్ప వసూళ్లు అంత లేవు అనేది ప్రచారంలో ఉంది.  అల్లు అర్జున్ అభిమానుల వెర్షన్ వేరేలా ఉంది. దీనిపై యెన్ టీవీ లో ఒక కథనం కూడా వచ్చింది
  • అల్లు అర్జున్ ను పోలీస్ లు విచారించడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ చేసిన పని వీడియో  చిత్ర పరిశ్రమ కు చూపించడం, ముఖ్యమంత్రి ముందు, చిత్ర పరిశ్రమ ఏదో తప్పు చేసిన వారిలా ఉండడం
  • ఇప్పటికి సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన బాలుడు ఇంకా ఆస్పత్రిలో ఉండడం.  అంత బాగానే ఉంది అంటోన్న డాక్టర్లు.  ఆ బాలుడు మాత్రం ఎవరిని గుర్తు పట్టడం లేదు, ఎవరితో మాట్లాడడం లేదు.  ఈ ఘటన జరిగింది డిసెంబర్ 4 న.  ఘటన జరిగి మూడు నెలలకు పైనే అయినా ఆ బాలుడి ఆరోగ్యంలో మార్పు లేదు. ఈ మధ్య ఎవరు ఈ విషయం గురించి మాట్లాడడంలేదు
  • హిందీ లో సూపర్ హిట్ అయినా పుష్ప సినిమా తెలుగులో అల్లు అర్జున్ సగటు అభిమానిని కూడా అంతగా మెప్పించలేదు
  • స్మగ్లర్ ల సినిమాలకు అవార్డులు ఇవ్వకూడదు. జై భీం లాంటి సినిమాలకు ఇవ్వాలి అని మంత్రి సీతక్క బహింరంగంగా చెప్పడం
  • పుష్ప సినిమా చూస్తుండగా ఒక స్మగ్లర్ ని ముంబై పోలీస్ లు అరెస్ట్ చేయడం.  సినిమా ఆపేసి సదరు స్మగ్లర్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లగా సినిమాని మల్లి ప్రదర్శించారు
  • ఇటీవలే ఒక హై స్కూల్ ప్రిన్సిపాల్ పుష్ప సినిమా చూసి మా స్కూల్ లో సగం మంది పిల్లలు చెడిపోయారు అని చెప్పడం. ఈ ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో 7 స్కూల్స్ ఉన్నాయని సమాచారం.   ఒక స్మగ్లర్ ని హీరో గా చూపించిన మొదటి తెలుగు సినిమా పుష్ప నే.  ఈ సినిమాను తీసింది కూడా ఒకప్పుడు లెక్కల మాస్టారు అయిన సుకుమార్
  • ఇటీవల సీనియర్ నటిమని కృష్ణవేణి సంస్మరణ సభలో కూడా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ స్మగ్లర్ లను, దేశ ద్రోహులను హీరోలు గా చూపిస్తున్నారు.  ఆ సంస్కృతి మంచింది కాదు.  ఇది పిల్లలపైన ప్రభావం చూఫుతుంది  అని భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు అన్నారు
  • ఇప్పుడు సరికొత్తగా పుష్ప సినిమా కు వచ్చిన లాభాలపై హై కోర్ట్ లో పిల్ దాఖలు అయింది. సుప్రీమ్ కోర్ట్ తీర్పు ప్రకారం,  పుష్ప కు వచ్చిన లాభాలను జానపడకళాకారుల సంక్షేమం (పింఛన్) కోసం ఖర్చు పెట్టాలి, అంతే కాకుండా చిన్న చిత్రాలకు ఇచ్చే రాయితీల కోసం కూడా పుష్ప లాభాలను ఉపయోగించాలి.   దీనిపై విచారణను రెండు వారాలు వాయిదా వేశారు.  ఈ లోగా సుప్రీమ్ కోర్ట్ తీర్పు కాపీ కోర్ట్ కు సమర్పించాలి
  • అల్లు అర్జున్ అత్యుత్సాహంతో చేసిన పనికి భవిష్యత్తులో తెలంగాణ లో టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షో లు ఉండవు అని తేలిపోయింది.  ఇది మిగతా సినిమాల మీద పరోక్షంగా ప్రభావం చూపింది, చూపుతోంది, చూపుతుంది
  • కర్ణాటక ప్రభుత్వం సింగల్ స్క్రీన్ అయినా, మల్టీ ప్లెక్స్ అయినా టికెట్ ధరను ఇటీవల బడ్జెట్ లో 200 గా నిర్ణయించింది. ఈ విధానం మన తెలంగాణ లో అమలు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు
  • అభిమానులను ఆర్మీ పేరుతో పిలుచుకునే అల్లు అర్జున్ కు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణంకూడా అల్లు ఆర్మీ నే.  ముఖ్యంగా చిన్న పిల్లలకు సర్ది చెప్పుకోలేని తల్లి తండ్రులది

మెగా స్టార్ చిరంజీవి కోటరీ నుండి బయటకు వచ్చి సొంత ఇమేజ్ ను డెవలప్ చేసుకోవాలనే తాపత్రయంలో తన వ్యక్తిత్వాన్ని పూర్తి గా డామేజ్ చేసుకున్న హీరో అల్లు అర్జున్.  1800 కోట్ల వసూళ్లను, రాజ మౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి ఎనిమిదేళ్ల క్రితం సాధించింది. ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి, టికెట్ రేట్లు పెంచి, బెనిఫిట్ షో లకు స్పెషల్ రేట్లు పెట్టి  సాధించిన వసూళ్లు ఇవి  (ఇందులో కూడా మైత్రి వారి లెక్కలలో ఏదో తేడా ఉంది)

పుష్ప అవకాశం మొదట మహేష్ బాబు కు వచ్చిన దీనిని మహేష్ బాబు తిరస్కరించారు. మహేష్ బాబు సినిమాలని కమర్షియల్ వాల్యూస్ తో పాటు సందేశాలు ఇచ్చే చిత్రాలే.  శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సర్కారువారి పాట, సరిలేరు నీకెవ్వరూ చిత్రాలతో మెసేజ్ ఇచ్చే మహేష్ బాబు ఈ పుష్ప సినిమాని తిరస్కరించారు

ఇండియా లోనే నెంబర్ వన్ హీరో అయిన ప్రభాస్ కు గర్వం ఏ మాత్రం ఉండదు.  అందరికి ప్రభాస్ డార్లింగ్ లా ఉంటాడు.

ఒకప్పుడు చిరంజీవి నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు అంటే అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు అల్లు అర్జున్ కు పోటీగా మహేష్ బాబు, తారక్, రామ్ చరణ్ ఉన్నారు. ప్రభాస్ ఇండియా నెంబర్ వన్ హీరో గా ఉన్నాడు.

నెంబర్ వన్ అంటే సినిమా వసూళ్లు  కాదు, వ్యక్తిత్వం అని ఇప్పటికైనా అల్లు అర్జున్ తెలుసుకోవాలి. ముఖ్యంగా అల్లు అర్జున్ పి ఆర్ టీం, స్ట్రాటజీ టీం