‘RC16’ షూటింగ్ అప్​డేట్​..టీజర్ రిలీజ్ అప్పుడే!

by | Mar 11, 2025 | సినిమా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘ఆర్‌సీ16’ వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. కాగా, కుస్తీతో పాటు క్రికెట్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. క‌న్న‌డ చ‌క్ర‌వ‌ర్తి శివరాజ్‌కుమార్, దివ్యేండు శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ గురించి ఓ క్రేజీ అప్టేట్ బయటకొచ్చింది.

ప్రస్తుతం ‘ఆర్​సీ 16’ మూవీ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ మూవీ కొత్త షెడ్యూల్ హైద్రాబాద్​లో సోమవారం రాత్రి మొదలైనట్లు తెలుస్తోంది. హైద్రాబాద్​లో శివార్లలో వేసిన ప్రత్యేక సెట్స్ లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు సమాచారం. హీరో రామ్ చరణ్(Ram Charan), హీరోయిన్ జాన్వీ కపూర్‌ మధ్య కొన్ని సీన్స్​ను షూట్ చేయనున్నారని సమాచారం. సాధ్యమైనంత వరకు చిత్రీకరణ పూర్తి చేసి ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా, మార్చి 27న రామ్‌చరణ్‌ (Ram Charan) పుట్టినరోజు కానుకగా టైటిల్‌, టీజర్‌ విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు.