ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత జట్టు, న్యూజిలాండ్ ను ఓడించి మూడవ సారి ఛాంపియన్స్ ట్రోఫీ ని గెలుచుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత జట్టును నడిపించిన నాయకుడు రోహిత్ శర్మ
అయితే ఐసీసీ ప్రకటించిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టీం అఫ్ ది టౌర్నమెంట్ లో రోహిత్ శర్మ కు స్థానమే దక్కలేదు. రోహిత్ తో పాటు హార్దిక్ పాండ్య, శుభమన్ గిల్, జడేజా, కుల్దీప్ యాదవ్ లకు చోటు దక్కలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఆడిన 11 మందిలో ఐదుగురుకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టీం అఫ్ ది టోర్నమెంట్ లో చోటు దక్కలేదు
ఇక ఐసీసీ టీం లో ఎవరికి చోటు దక్కిందో చూద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీ లో ప్లేయర్ అఫ్ ది సిరీస్ గెలుచుకున్న న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర, ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆఫ్ఘానిస్తాన్ ప్లేయర్ ఇబ్రహీం జర్దాన్ లను ఓపెనర్లు గా ఎంచుకుంది
భారత జట్టులో ప్రస్తుతం ఏయే స్థానాలలో విరాట్ కోహ్లీ, శ్రేయ అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్నారో, అవే స్థానాలకు వీళ్ళిద్దరిని ఎంపిక చేసింది ఐసీసీ
వికెట్ కీపర్ గా కె ఎల్ రాహుల్ ను ఎంపిక చేయగా, బెస్ట్ ఫీల్డర్ మరియు హిట్టర్ అయినా గ్లెన్ ఫిలిప్స్ ని కూడా ఎంపిక చేసింది
కెప్టెన్ గా అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మ ను కాదని, న్యూజిలాండ్ కెప్టెన్ సాంట్నర్ ని ఎంపిక చేసింది.
ఆఫ్ఘనిస్తాన్ అల్ రౌండర్ అజమతుల్లా ఓమార్జాయి ని కూడా ఎంపిక చేసింది
ఇక బౌలింగ్ డిపార్ట్ మెంట్ కు వస్తే ఛాంపియన్స్ ట్రోఫీ లో అత్యధిక వికెట్లు తీసిన మొదటి ముగ్గురు బౌలర్లు అయిన హెన్రీ, వరుణ్ చక్రవర్తి, షమీ లకు చోటు లభించింది
12 వ ఆటగాడిగా ఇప్పుడిప్పుడే భారత అల్ రౌండర్ గా ఎదుగుతోన్న అక్షర్ పటేల్ ను ఎంపిక చేసింది. అక్షర్ పటేల్ ఛాంపియన్స్ ట్రోఫీ లో కొన్ని కీలక భాగస్వామ్యాలలో పాలు పంచుకున్నాడు
ఐసీసీ ప్రకటించిన టీం అఫ్ ది టోర్నమెంట్ సభ్యుల జాబితా మీ కోసం


