గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఆర్సీ16’ సినిమాతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో చెర్రీ నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా నటించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు సనా తొలిసారిగా రామ్ చరణ్‌తో (Ram Charan) మూవీని చేస్తుండడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం తర్వాత రామ్‌చరణ్(Ram Charan), స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో(Sukumar) సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది రెండో సినిమా కాగా.. రామ్‌చరణ్ కెరీర్‌లో ఇది 17వ చిత్రంగా తెరకెక్కనుంది. అంతకుముందు రామ్‌చరణ్ (Ram Charan) హీరోగా, సమంత హీరోయిన్ గా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ మూవీ సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ‘రంగస్థలం’లో చిట్టిబాబుగా పల్లెటూరు యువకుడి పాత్రలో రామ్‌చరణ్‌ని చూపించారు సుకుమార్. తాజా చిత్రంలో మాత్రం అందుకు పూర్తి డిఫరెంట్ గా ఉన్న రోల్ లో రామ్ చరణ్‌ని (Ram Charan) చూపించనున్నారట. ఈ మూవీలో రామ్‌చరణ్ సరికొత్త మేకోవర్‌లో ట్రెండీ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఇద్దరు టాప్ హీరోయిన్లను తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం రష్మికా మందన్నా, సమంతల(Samantha) ను కథానాయికలుగా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిలో రష్మికా మందన్నా(Rashmika Mandana) పుష్ప 2, ఛావా వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకోగా.. సమంత పాన్ ఇండియా సినిమాలతో పాటు ఫ్యామిలీ మెన్, సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీసులు చేయడం ద్వారా నార్త్ ఆడియన్స్ కు చేరువయ్యారు. ఇంతటి క్రేజ్ ఉన్న ఆర్టిస్టులతో సినిమా చేయడం ద్వారా సుకుమార్ మరోసారి ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

