జగన్ కు, అంబటి రాంబాబు కు జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్
ప్రెస్ మీట్ లో జగన్, అంబటి రాంబాబు వ్యాఖ్యలకు జనసేన శాసన సభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు
ఈ ఉదయం ప్రెస్ మీట్ పెట్టిన శ్రీనివాస్ గారు గత ప్రభుత్వ చేతగాని తనం వలన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్ళిపోయింది అని అన్నారు
జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) పుడతానే ఎంపీ పదవితో పుట్టాడు అని అంబటి రాంబాబు (Ambati Rambabu) అన్నారు అని ఆ మాటలకు కౌంటర్ గా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తండ్రి ముఖ్యమంత్రి కాకపోతే జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)ఎంపీ కాదుకదా కౌన్సిలర్ కూడా అయ్యేవాడు కాదు అని బొలిశెట్టి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మా నాన్నగారు ముఖ్యంమత్రి అయితే నేను ఈపాటికి ముఖ్యమంత్రి అవుదునేమో అని అన్నారు. ఎందుకంటె అన్యాక్రాంతంగా వచ్చి పడిన డబ్బుతో పేద ప్రజలకు ఎర చూపి సంక్షేమం పేరుతో దోపిడీ చేసి కోట్లాది రూపాయలను దండుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంబటి రాంబాబు ను ట్రాప్ లో పెట్టి అందరిని ఏదో ఒకటి మాట్లాడించాలని, అయన గట్టిగా మాట్లాడితే అబద్దం నిజం కాదు
గడచినా 10 సంవత్సరాలలో నెగ్గిన నెగ్గకపోయినా, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారు ప్రజల మధ్యలో ఉన్నారు. ఈ జైలు సంస్కృతి ఎక్కడనుంచి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రిని అన్యాయంగా 51 రోజులు జైలు లో ఉంచింది నిజం కాదా. కేసు ప్రూవ్ అయిందా.
నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) గారిని బియ్యం దొంగ అన్నారు అంబటి రాంబాబు. ఈ మాటకు శ్రీనివాస్ కౌంటర్ ఇస్తూ బియ్యం దొంగలు చంద్రశేఖర్ రెడ్డి, రంగనాధరాజు, పేర్ని నాని (Perni Nani) మీ పార్టీ లోనే ఉన్నారు.
అంబటి రాంబాబు నువ్వు నీటిపారుదల శాఖ మంత్రిగా చేసి కుసెక్కు అంటే అర్ధం తెలీదు, డయాఫ్రమ్ వాల్ అంటే తెలీదు. కనీసం గుంటూరు జిల్లాలో పంట కాల్వలలో చిలుకు తీయించావా అని అడిగారు. మంత్రి పదవి పోయాక, ఏం ఎల్ ఏ గా ఓడిపోయాక, ఇంచార్జి పదవి పోయాక నువ్వు నాదెండ్ల మనోహర్ గారిని విమర్శిస్తావా. అసెంబ్లీ కి రండి, డిబేట్ చేద్దాం. ప్రతి రోజు మాట్లాడే దాంట్లో వైసీపీ అక్రమాలే కనిపిస్తాయి
ఋషికొండలో 500 కోట్లు పెట్టి ప్యాలెస్ ఎందుకు కట్టాల్సి వచ్చింది. విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) గారు, మోపిదేవి వెంకట రమణ బయటకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. ఇంకా పోలవరం ప్రాజెక్ట్ మీద, స్టీల్ ప్లాంట్ మీద, మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతాని చెప్పారు…చేశారా అని వైసీపీ (YCP) ని కడిగి పడేశారు
11 సీట్లను గెలిపించారు. మీ 11 మంది ప్రజలకు ఏం చేయాలో ఆలోచించండి. ప్రజలకు సేవ చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టండి అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు

