యూత్ దిల్‌ కుష్‌ చేస్తున్న ‘దిల్‌ రూబా’ ట్రైలర్‌

by | Mar 6, 2025 | సినిమా

యువ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్‌ రూబా’. విశ్వకరుణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శివమ్‌ సెల్యూలాయిడ్స్‌, సారెగమ మ్యూజిక్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రుక్సర్‌ థిల్లాన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కిరణ్‌ అబ్బవరం పాత్ర గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో నజియా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. తప్పు చేశాక చెప్పే సారీకి, అవసరం తీరాక చెప్పే థాంక్స్ కి నా దృష్టిలో విలువ లేదు అంటూ కిరణ్ అబ్బవరం చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. సత్య కామెడీ నవ్వులు పూయించింది. ఒకప్పటి ప్రేమికురాలు మరోసారి హీరో లైఫ్ లోకి రావడం ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఈ సినిమా కథాంశంగా ఉండనుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. సామ్ సి.ఎస్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ ను మరోమెట్టు ఎక్కించింది. లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో ఆద్యంతం రసవత్తరంగా సాగిన 2.39 నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. కాగా, ఈ సినిమా మార్చి 14న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.