ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయనున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో హై యాక్షన్ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తుండగా…అట్లీ అల్లు అర్జున్ (Allu Arjun) కోసం చాలా స్పెషల్ గా ఈ పాత్రని డిజైన్ చేస్తున్నాడట. దీని ప్రకారం ఈ చిత్రం ఇంటర్నేషనల్ లెవెల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనుండగా.. ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ జాన్వీ కపూర్ తో పాటుగా ఐదుగురు హీరోయిన్స్ ఉంటారని, వీరిలో ముగ్గురు ఫారెన్ హీరోయిన్లు ఉండనున్నారని అంటున్నారు. ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండనుండగా.. ఇందులో అల్లు అర్జున్ (Allu Arjun) ఓ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఇప్పటికే అల్లు అర్జున్ విదేశాలకు వెళ్ళి మరీ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడని తెలుస్తోంది.
కాగా, పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రలో తమిళ స్టార్ హీరో అమరన్ ఫేమ్ శివకార్తికేయన్ నటించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అట్లీ ఈ మూవీలో శివకార్తికేయన్ పాత్రలో అద్భుతంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. మునుపెన్నడూ లేని రీతిలో శివకార్తికేయన్ (Siva Karthikeyan) మేకోవర్ ఇందులో ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో మదరాసి సినిమాను చేస్తున్నాడు. ఈ మూవీని ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత శివకార్తికేయన్ మే నుండి అల్లు అర్జున్(Allu Arjun) – అట్లీ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారని సమాచారం. ‘అమరన్’తో టాలీవుడ్ లో కూడా అభిమానుల్ని సంపాదించుకున్న శివకార్తికేయన్ అల్లు అర్జున్ సినిమాతో మరింత దగ్గరవడం ఖాయంగా కనిపిస్తుంది.

