తండేల్ నుండి ‘హైలెస్సో హైలెస్సా’ పాట  విడుదల

by | Mar 6, 2025 | సినిమా

నాగ చైతన్య, సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన తండేల్ ఫిబ్రవరి 7 న విడుదలై ఘన విజయం సాధించింది.  ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు సినిమాకు ప్రాణం పోశాయి.  దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) అద్భుతమైన స్వరాలూ అందించారు. థియేటర్ రన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు, ఇక,ఈ తండేల్ నుండి పూర్తి వీడియో సాంగ్స్ ను విడుదల చేస్తున్నారు మేకర్స్. రేపటి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవబోతోంది  తండేల్(Thandel).

రెండు రోజుల క్రితం తండేల్ నుండి ‘బుజ్జితల్లి’ (Bujji Thalli) వీడియో సాంగ్ ను విడుదల చేసిన మేకర్స్ ఈ రోజు ‘హైలెస్సో హైలెస్సా'(Hilesso Hilessa) పాటను విడుదల చేశారు.