తెలంగాణ లో భాజపా తదుపరి వ్యూహం ఏంటి

by | Mar 6, 2025 | రాజకీయాలు

కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాజపా విజయం సాధించడం పట్ల ఈ పార్టీ లో సంబరాలు చేస్తుకుంటున్నారు. 

భాజపా అభ్యర్థి అంజి రెడ్డి ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ గా భాజపా అభ్యర్థి అంజిరెడ్డి, తన ప్రత్యర్థి కాంగ్రెస్ (Congress) కు చెంది నరేందర్ రెడ్డి పై 5,106 ఓట్ల తేడాతో విజయం సాధించారు.   అంతకు ముందు భాజపా మద్దతు ఇచ్చిన కొమురయ్య కూడా గెలిచారు

ప్రచారంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్ భాజపా విజయంలో కీలక పాత్ర పోషించారు.  మూడు నెలల ముందే అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసుకుంది. పక్క ప్రణాళికతో ప్రచారం నిర్వహించి భాజపా విజయం సాధించింది

అధికార పార్టీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో రేవంత్ రెడ్డి ఖంగు తిన్నారు.   రెండు కీలకమైన ఎమ్మెల్సీ స్థానాలను భాజపా గెలుచుకోవడంతో పార్టీ శ్రేణులు ఆనందంలో ఉన్నారు.

కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన భాజపా, ఈ రాజధాని ఢిల్లీలో కూడా పాగా వేసింది. భాజపాకు(BJP) , మోడీ (Narendra Modi) కి అంతు చిక్కనిది ఏమైనా ఉంటె అవి దక్షిణాది రాష్ట్రాలు.  భాజపా ఎక్కడ పోటీ చేస్తే అక్కడ గెలుస్తూ వచ్చిన భాజపా కర్ణాటకలో ఓడిపోవడం ఇప్పటికి మింగుడుపాడనీ విషయం

దక్షిణాదిన ఉన్న ఒక్క కర్ణాటక రాష్ట్రంలో ఓటమి పాలైన భాజపా ప్రస్తుతం తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది.  రెండు ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకున్నంత  మాత్రాన భాజపా ఇక్కడేదో సాధించినట్లు కాదు. అయినా ఇప్పుడున్న పరిస్థితులలో భాజపా కు ఊరటనిచ్చే విజయమే

ఈ సారి ఎమ్మెల్సీ ఎన్నికలకు భారాస (BRS) దూరంగా ఉండడం భాజపాకి లాభించిందా అన్న అనుమానాలు లేక పోలేవు.  అయితే భాజపా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల  మీద ముఖ్యంగా హైదరాబాద్ మీద దృష్టి పెట్టచ్చు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా గెలిస్తే మాత్రం కచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ మాత్రం తప్పదు

మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు రెండింటిని గెలుచుకున్న భాజపా వచ్చే ఎన్నికల్లో ముక్కోణపు పోటీ తప్పదు అన్న సంకేతాలు పంపిస్తోందా? భాజపా ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై గురి పెడుతుందా? రెండు జాతీయ పార్టీ ల మధ్య, ప్రాంతీయ పార్టీ ఆయిన భారస తెలంగాణ సెంటిమెంట్ పని చేస్తుందా? రేవంత్ రెడ్డి కెసిఆర్, చంద్రబాబు లాగా సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడా అన్న విషయాలపై క్లారిటీ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో వస్తుంది.