ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సమరానికి సిద్దమయింది. సరైన జట్లే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మార్చ్ 9 న భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరగనుంది
అయితే ఫైనల్ కు వచ్చిన రెండు జట్ల మధ్య కొన్ని పోలికలున్నాయి.
నిలకడైన, అనుభవజ్ఞుడైన బాట్స్ మన్ భారత జట్టుకు విరాట్ కోహ్లీ రూపంలో ఉంటే, న్యూజిలాండ్ కు విలియమ్సన్ రూపంలో ఉన్నాడు
భారత జట్టుకు నలుగురు, ఐదురుగు స్లో/స్పిన్నర్లు అక్షర్ పటేల్, జడేజా, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి రూపంలో ఉంటే, న్యూజిలాండ్ కు సాంట్నర్, ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బ్రేస్ వెల్ రూపంలో ఉన్నారు
భారత జట్టుకు షమీ, న్యూజిలాండ్ కు హెన్రీ రూపంలో నిఖార్సైన పేస్ బౌలర్ లు ఉన్నారు.
భారత జట్టుకు శుభ్ మన్ గిల్, న్యూజిలాండ్ కు విల్ యంగ్ ఉన్నారు. అలాగే భారత జట్టుకు శ్రేయాస్ అయ్యర్ ఎలాగో న్యూజిలాండ్ కు టామ్ లేధం కూడా అలాగే
మిడిల్ ఆర్డర్ లో భారత జట్టుకు కె ఎల్ రాహుల్ లాగా, న్యూజిలాండ్ కు మిచెల్ ఉన్నాడు
భారత జట్టుకు పాండ్య లాగా న్యూజిలాండ్ జట్టుకు ఫిలిప్స్, రచిన్ రవీంద్ర లు అల్ రౌండర్లుగా ఉన్నారు.
భారత జట్టుకు, న్యూజిలాండ్ కు తేడా రోహిత్ శర్మ మాత్రమే. భారత జట్టుకు కెప్టెన్ గా అపార అనుభవం ఉన్న రోహిత్ శర్మఉంటే, న్యూజిలాండ్ అంతగా అనుభవం లేని సాంట్నర్ కెప్టెన్ గా ఉన్నాడు. సన్తనర్ కెప్టెన్ అయ్యాక న్యూజిలాండ్ గెలుపుశాతం పెరిగింది ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన మిగతా జట్లలో ఇంత మంది స్లో బౌలర్లు లేరు. దుబాయ్ పిచ్ లకు స్లో బౌలర్లు కావలి. అంతేకాకుండా, బ్యాటింగ్ కూడా నిలకడగా, స్ట్రైక్ రొటేట్ చేసే వాళ్ళు కావాలి. ఆ రకంగా భారత, న్యూజిలాండ్ జట్లు సమతూకంగా ఉన్న జట్లు. అందుకే ఫైనల్ కు అర్హత సాధించాయి. సమతూకం ఉన్న జట్ల మధ్య సమరం మరింత ఇంటరెస్టింగ్ గా ఉంటుంది

