టాలీవుడ్ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. సరైన సమయంలో పోలీసులు ఈమెని ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రమాదం తప్పింది. కల్పన ప్రస్తుతం కొలుకుంటుందని వైద్యులు తెలిపారు. కాగా, కల్పన ఆర్టిస్టుగా,లిరిక్ రైటర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఐదేళ్ల వయసులోనే గాయనిగా కెరీర్ ప్రారంభించిన కల్పన 2013 నాటికి దేశ విదేశాల్లో మొత్తంగా 1500 పాటలను రికార్డు చేసింది. అలాగే 3000 మ్యూజిక్ కాన్సర్ట్ లలో ఆలపించి అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.
తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో అనేక పాటలు పాడారు. ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేవీ మహాదేవన్‌తో కలిసి కల్పన ఎన్నో మధురమైన పాటలు ఆలపించారు. ఈ నేపథ్యంలోనే గాయని కల్పన తన కెరీర్ లో పాడిన పాటలలో అత్యుత్తమ సాంగ్స్ ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం..
- జూలే జూలే – (వర్షం) ,
- యే జిల్లా – (శంకర్ దాదా ఎంబిబిఎస్) ,
- గోంగూర తోట కాడ– (వెంకీ) ,
- ముసుగు వెయ్యొద్దు మనసు మీద – (ఖడ్గం) ,
- చెలియా చెలియా సింగారం – (కలుసుకోవాలని),
- అబ్బో నీ అమ్మ గొప్పదే – (అంజి) ,
- శ్రీ ఆంజనేయ శ్లోకం – (శ్రీ ఆంజనేయం)
- దొండ పండు లాంటి – (పెళ్ళాం ఊరేలితే)
- అధిరే అధిరే – (నువ్వోస్తానంటే నేనొద్దంటానా),
- ఏ ఊరే చిన్నదానా – (భద్ర )
- ప్రేమంటే సులువు కాదురా – (ఖుషి ) ,12. అందాల చుక్కలా ౼ ( వెంకీ)
- ఇందురుడు చందురుడు ౼ ( మాస్ )
- నమ్మిన నా మది ౼ ( రాఘవేంద్ర)
- చెప్పాలని ఉంది ౼ (ఒంటరి)

