టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), బ్యూటీ క్వీన్ శ్రీలీల(Sree Leela) హీరోహీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’.చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థ నిర్మిస్తోంది. నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మాతలకుగా వ్యవహరిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సాయి శ్రీరామ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. భీష్మ సినిమా తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఇప్పటికే మువీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్‌ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇదిలాఉంటే.. ఈ సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner) కీలక పాత్ర పోషించాడట. ఈ విషయాన్ని ఇన్నాళ్లు దాచిపెట్టిన చిత్రబృందం తాజాగా ఓ కార్యక్రమంలో బయటపెట్టారు. ఇటీవల ‘కింగ్స్టన్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ రవి శంకర్ ‘రాబిన్‌హుడ్’లో డేవిడ్ వార్నర్ అతిథి పాత్ర పోషించినట్టు పేర్కొని అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. అయితే ఈ సినిమాలో తన పాత్ర కోసం డేవిడ్ వార్నర్ రూ.50 లక్షలను రెమ్యునరేషన్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో వార్నర్ పోషించేది చిన్న పాత్రే అయినా అతనికి ఉన్న క్రేజ్ దృష్ట్యా భారీ మొత్తంలో పారితోషికం అందించారట మేకర్స్. ఇక డేవిడ్ వార్నర్ లాంటి వరల్డ్ క్లాస్ క్రికెటర్ తెలుగు సినిమా ద్వారా చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తుండడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో తెలుగు హీరోల డైలాగులు చెబుతూ రీల్స్ చేసిన సంగతి తెలిసిందే. బాహుబలి, పుష్ప (Pushpa) , డీజే టిల్లు అంటూ పలువురు తెలుగు హీరోల స్టైల్‌ను అనుకరిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరించాడు.

