జాన్వీకపూర్ బర్త్‌డే: ఫ్యాన్స్‌కి ‘ఆర్‌సీ16’ టీం క్రేజీ సర్‌ప్రైజ్‌!

by | Mar 6, 2025 | సినిమా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) , ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఆర్‌సీ16’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ భామ జాన్వీకపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, మార్చి 6న హీరోయిన్ జాన్వీకపూర్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. చేతిలో మేక పిల్లను పట్టుకొని ఉన్న జాన్వీకపూర్ క్యూట్ లుక్‌ ఫోటోని విడుదల చేశారు. ఇందులో జాన్వీ ఎక్స్‌ప్రెషన్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ మూవీలో జాన్వీకపూర్ లుక్ అద్భుతంగా ఉండబోతుందంటూ ఈ పోస్ట్ కు బుచ్చిబాబు క్యాప్షన్ జాతచేశారు.

కాగా, కుస్తీతో పాటు క్రికెట్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా.. ఇటీవలే హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. సెకండ్ షెడ్యూల్‌ మార్చి రెండో వారం నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌తో పాటు ఇతర ముఖ్య నటులపై కుస్తీ బ్యాగ్డ్రాప్ సీన్స్ షూట్ చేయనున్నట్లు సమాచారం. కాగా, మార్చి 27న రామ్‌చరణ్‌ (Ram Charan) బర్త్ డే కానుకగా టైటిల్‌(Title) , టీజర్‌ (Teaser) రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్(Shiv Raj Kumar) , జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు