చెలరేగిన షేన్ వాట్సన్, బెన్ డంక్ ; ఇండియా మాస్టర్స్ పై ఆస్ట్రేలియా మాస్టర్స్ ఘన విజయం
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో భాగంగా ఇండియా మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా మాస్టర్స్, ఇండియా మాస్టర్స్ పై 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మాస్టర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. ఆస్ట్రేలియా మాస్టర్స్ ఒక వికెట్ కోల్పోయి 269 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ షాన్ మార్ష్ 15 బంతుల్లో 22 పరుగులు చేసి నేగి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తరవాత మరో ఓపెనర్, కెప్టెన్ అయిన షేన్ వాట్సన్, వన్ డౌన్ బ్యాట్స్ మన్ అయినా బెన్ డంక్ తో ఎడా, పెడా ఫోర్లు, సిక్సర్ లు బాదారు.
షేన్ వాట్సన్ 52 బంతుల్లో 110 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఇందులో 7 సిక్సర్లు 12 ఫోర్లు ఉన్నాయి. బెన్ డంక్ 53 బంతుల్లో 132 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఇందులో 10 సిక్సర్లు , 12 ఫోర్లు ఉన్నాయి. వీరిద్దరూ రెండవ వికెట్ కు 236 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు
270 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా ((India) మాస్టర్స్ కు చక్కటి శుభారంభం లభించి నా, వెంట వెంటనే వికెట్లు కోల్పోతూ ఉండడంతో, 174 పరుగులకు అల్ అవుట్ అయ్యింది
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఒక్కడే 33 బంతుల్లో 64 పరుగులు చేసి ప్రేక్షకులను అలరించాడు. యువరాజ్ సింగ్ లో ఈ మ్యాచ్ లో ఆడకపోవడం కూడా ఆస్ట్రేలియా కు కలిసివచ్చిన అంశం. అంతే కాకుండా ఇండియా మాస్టర్స్ ఫీల్డర్లు 3 క్యాచ్ లు వదిలేశారు
ఆస్ట్రేలియా మాస్టర్స్ బౌలర్ల లో స్పిన్నర్ దొహేట్రీ 5 వికెట్లు తీసుకున్నాడు. బెన్ డంక్ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు

