నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కోర్ట్'(Court). స్టేట్ వర్సెస్ ఏ నోబడీ (State Vs A Nobody) అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్ర పోషించారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ప్రశాంతి త్రిపిరినేని నిర్మిస్తుంది. పొక్సో చట్టం నేపథ్యంలో సందేశాత్మకంగా ఉంటుందని, ఈ సినిమా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. భారీ అంచనాలతో ముస్తాబైన ఈ సినిమా రిలీజ్ మార్చి 14న విడుదల కానుండగా, దానికి ముందు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
ఈ ఈవెంట్‌కు హాజరై నాని (Natural Star Nani) మాట్లాడే మూమెంట్ కోసం ఆయన అభిమానులు తహతహలాడుతున్నారు. ఆ సస్పెన్స్‌కు తెరదించుతూ టైమ్, డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ‘కోర్ట్’ మూవీ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మార్చి 7న (శుక్రవారం) హైద్రాబాద్ లోని జెఆర్సి కన్వెన్షన్‌లో సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా, శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా.. మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

