5గురు హీరోయిన్లతో ఇంటర్నేషనల్ లెవెల్​లో..!

by | Mar 5, 2025 | సినిమా

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా పాత్రలో నటించిన సీక్వెల్‌ మూవీ పుష్ప 2 ది రూల్‌ (Pushpa) . స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించింది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్, అద్భుతమైన సంగీతం అందించారు. అయితే ఈ సినిమా త‌ర్వాత అల్లు అర్జున్ తర్వాతి ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అల్లు అర్జున్ త్రివిక్ర‌మ్‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఇంకా స్క్రిప్ట్ పనులు పూర్తి చేయలేదని తెలుస్తోంది. దాంతో ఈ సినిమా కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని.. ఈ క్రమంలోనే ఈ సినిమాను పక్కన పెట్టిన అల్లు అర్జున్ తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేయనున్నాడని సమాచారం.

అల్లు అర్జున్(Allu Arjun) , అట్లీ (Atlee) కాంబినేషన్ లో హై యాక్షన్‌ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తుండగా.. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే అట్లీ అల్లు అర్జున్ కోసం చాలా స్పెషల్ గా ఈ సినిమాని డిజైన్ చేస్తున్నాడట. దీని ప్రకారం ఈ చిత్రం ఇంటర్నేషనల్ లెవెల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో సన్‌ పిక్చర్స్‌ (Sun Pictures) ఈ సినిమాను నిర్మించనుండగా.. ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్ తో పాటుగా ఐదుగురు హీరోయిన్స్‌ ఉంటారని, వీరిలో ముగ్గురు ఫారెన్ హీరోయిన్లు ఉండనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండనుండగా.. ఇందులో అల్లు అర్జున్ ఓ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.