ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి సెమి ఫైనల్ లో ఆస్ట్రేలియా పై భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది. ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే భారత జట్టు లక్ష్యాన్ని చేధించింది
265 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మొదట్లోనే శుభ్ మన్ గిల్ వికెట్ ను కోల్పోయింది. 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ కూడా అవుట్ కావడంతో 43 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడినట్లు అనిపించింది
అయితే ఆపద్బాధవుడు శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ మూడవ వికెట్ కు 91 పరుగులు జోడించారు. నిలకడగా రాణిస్తూ భాగస్వామ్యాలు నేనకాపుతోన్న శ్రేయాస్ అయ్యర్ 45 పరుగులు చేసి అవుట్ అయ్యాడు
విరాట్ కోహ్లీ నాలుగవ వికెట్ కు అక్షర్ పటేల్ తో కలిసి 44 పరుగులు, కె ఎల్ రాహుల్ తో కలిసి ఐదవ వికెట్ కు 47 పరుగులు జోడించాక, 84 పరుగులు చేసి విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు
ఆ తరవాత వచ్చిన హార్దిక్ పాండ్య తో జత కలిసిన కె ఎల్ రాహుల్ ఆరవ వికెట్ కు 34 పరుగులు జోడించాక 28 పరుగులు చేసిన హార్దిక పాండ్య అవుట్ అయ్యాడు.
34 బంతుల్లో 42 పరుగులు చేసిన కె ఎల్ రాహుల్ చివర వరకు నిలబడి భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు
2023 ప్రపంచ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమికి, భారత్ ప్రతీకారం తీర్చుకుంది
ఆస్ట్రేలియా బౌలర్ల లో నాథన్ ఎల్లిస్, జంపా రెండేసి వికెట్లు తీయగా, ద్వర్షుయిస్, కొన్నోలిస్ చెరో ఒక వికెట్ తీశారు
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు .49.3 ఓవర్ల లో 264 పరుగులకు అల్ అవుట్ అయ్యింది
ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొదట్లో నత్త నడకలా సాగింది. ఓపెనర్ కూపర్ కొన్నోల్లీ 9 బంతులాడి పరుగులేమి చేయకుండా డక్ అవుట్ అయి వెనుతిరిగాడు. ట్రావిస్ హెడ్ లాంటి బ్యాట్స్ మన్ 11 పరుగులు ఆడి ఒక్క పరుగు చేశాడంటే పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.
అయితే ట్రావిస్ హెడ్ నెమ్మదిగా బ్యాట్ ఝుళిపించడం మొదలు పెట్టాడు. 33 బంతుల్లో 39 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. లబుషేన్ 29 పరుగులు, జోష్ ఇంగ్లిస్ 11 పరుగులు చేసి అవుట్ అయ్యారు.
స్లో పిచ్ ల మీద ఎలా ఆడాలో బాగా తెలిసిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ 96 బంతుల్లో 73 పరుగులు చేసి షమీ బౌలింగ్ లో ఫుల్ టాస్ బాల్ కు అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన మాక్స్ వెల్ రాగానే సిక్సర్ కొట్టి ఆ తరవాత బంతికే అవుట్ అయ్యాడు.
స్టీవ్ స్మిత్, మాక్స్ వెల్ వికెట్ల ను వెంట వెంటనే కోల్పోయిన ఆస్ట్రేలియా 37. 3 ఓవర్ల లో 205 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది. ఒక వైపు వికెట్లు పడుతున్న, మరో పక్క అలెక్స్ క్యారి నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డు ను కదిలించాడు. అలెక్స్ క్యారి 57 బంతుల్లో 61 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు
మొదటి వికెట్ తొందరగా కోల్పోయినా, స్టీవ్ స్మిత్, మాక్స్ వెల్ వికెట్లు వెంట వెంటనే కోల్పోయినా, ఆస్ట్రేలియా చిన్న, చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పుతూ స్కోర్ బోర్డు ను కదిలించింది.
భారత జట్టు బౌలర్ల లో షమీ మూడు వికెట్ లు తీయగా, వరుణ్ చక్రవర్తి, జడేజా లు రెండేసి వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ కీలకమైన మాక్స్ వెల్ వికెట్ తీశాడు. ఆఖరి వికెట్ ను హార్దిక్ పాండ్య తీశాడు

