టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. #NKR21 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో
సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, యానిమల్ ఫేమ్ పృథ్వీవీరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి వచ్చిన ఓ అప్‌డేట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. యాక్షన్ త్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముందుగా మెరుపు, రుద్ర అనే టైటిల్స్ ను అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం చిత్రబృందం మరో పవర్‌ఫుల్ టైటిల్ ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే టైటిల్ మేకర్స్ ఫిక్స్ చేశారట. ఈ సినిమాకు ముందుగా మెరుపు, రుద్ర అనే టైటిల్స్ ను అనుకున్నారని వార్తలొచ్చాయి. కానీ చివరికి ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ టైటిల్ ని ఫిక్స్ చేశారని సమాచారం. కాగా, ఈ సినిమాకు తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా, అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.

