నయనతార, రష్మీకను వెనక్కినెట్టిన సాయిపల్లవి

by | Mar 4, 2025 | సినిమా

ఇండస్ట్రీలో ఏదైనా సినిమా విజయవంతం కావాలంటే హీరోలతో పాటుగా హీరోయిన్లది కీలక పాత్ర అనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హీరోలకు ధీటుగా హీరోయిన్లు కూడా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ముఖ్యంగా వరుస హిట్లున్న హీరోయిన్ల రెమ్యునరేషన్ చూస్తుంటో షాక్ అవ్వక మానరు. దక్షిణాదిలో ఒకప్పుడు నయనతర, అనుష్క శెట్టిలు బాక్సఫీస్ వద్ద భారీ హిట్లు నమోదు చేసి టాప్ హీరోయిన్లుగా ఎదిగారు. అయితే వరుస ప్లాప్స్ తో అనుష్క శెట్టి ఈ రేసు నుంచి వైదొలుగగా.. నయనతర మాత్రం నాటి నుంచి నేటి వరకు అగ్ర శ్రేణి కథానాయికగా వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుత తరం హీరోయిన్లలో నయనతారనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నిలిచారు. బాలీవుడ్‌ మూవీ జవాన్‌ కోసం రూ. 12 కోట్లు రెమ్యునరేషన్ గా నయనతారనే అందుకున్నట్లు సమాచారం. అలాగే మరో స్టార్ హీరోయిన్ రష్మీక మందన్నా కూడా పుష్ప 2 మూవీ కోసం రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకున్నట్లు సమాచారం.

అయితే తాజాగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఇప్పుడు నయనతారతో పాటుగా రష్మీక మందన్నాను వెనక్కినెట్టినట్లు తెలుస్తోంది.
ఇటీవల తమిళంలో శివకార్తికేయన్‌తో చేసిన ‘అమరన్‌’ మూవీ తెలుగులో నాగచెతన్యతో చేసిన ‘తండేల్‌’ సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. దీంతో సాయిపల్లవి క్రేజ్ ఇప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయింది. కాగా ప్రస్తుతం సాయిపల్లవి ప్రస్తుతం రామాయణ అనే హిందీ చిత్రంలో సీతగా నటిస్తున్నారు. నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగాను నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రిప్రోడక్షన్ పనులు జరుపుకుంటోంది. కాగా, ఈ రామాయణ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోందన్న విషయం తెలిసిందే. అయితే ఇందులో తొలిభాగంలో నటించడానికే సాయిపల్లవి ఏకంగా రూ.15 కోట్లు రెమ్యునరేషన్ గా అందుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు నయనతార రూ. 12 కోట్లతో, రష్మీక మందన్నా రూ. 10 కోట్లతో
టాప్ లో ఉండగా.. సాయిపల్లవి రూ.15 కోట్లు పారితోషకంగా అందుకుంటూ వీరిద్దరిని వెనక్కినెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.