‘దిల్‌ రూబా’ ట్రైలర్‌ రిలీజ్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

by | Mar 4, 2025 | సినిమా

యువ హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్‌ రూబా’. విశ్వకరుణ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శివమ్‌ సెల్యూలాయిడ్స్‌, సారెగమ మ్యూజిక్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ కిరణ్‌ అబ్బవరం పాత్ర గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలో నజియా కీలక పాత్రలో నటిస్తోంది.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో క్రేజీ అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. ‘దిల్ రూబా’ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. ఈ మూవీ ట్రైలర్‌ను మార్చి 6న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ మూవీ ట్రైలర్ అభిమానుల్ని కచ్చితంగా ఆకట్టుకునేలా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమా మార్చి 14న థియేటర్లలో విడుదల కానుంది.