ప్రభాస్ ‘స్పిరిట్’కి రూ.2000 కోట్లు.. సందీప్ వంగా

by | Mar 3, 2025 | సినిమా

నేషనల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘స్పిరిట్’. ఈ మూవీలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రానున్న ఈ మూవీని టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించ‌నున్నారు. స్పిరిట్ మూవీకి హర్షవర్థన్‌ రామేశ్వర్‌ మ్యూజిక్ అందిస్తుండగా..ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, మాలీవుడ్ స్టార్ హీరో మమ్మూట్టి కీలక పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్ మీద‌కి వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ మూవీ డైరెక్టర్ సందీప్ వంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఈ క్రమంలోనే యాంకర్ ఇలా ప్రశ్నించింది.. కబీర్ సింగ్ తో షాహిద్ కపూర్ కి, యానిమల్ తో రణ్ బీర్ సింగ్ కి వాళ్ల కెరీర్ లోనే సూపర్ హిట్స్ ఇచ్చారు. మరి ప్రభాస్ తో చేస్తున్న ‘స్పిరిట్'(Spirit) మూవీకి మీ లక్ష్యం ఏంటి అని అడగ్గా.. సందీప్ ఇలా బదులిచ్చాడు.. స్పిరిట్ మూవీ రాజమౌళి-ప్రభాస్ (Prabhas) కాంబోలో వచ్చిన బాహుబలి వసూళ్లని దాటాలంటే రూ.2000 కోట్లు కలెక్షన్స్ రాబట్టాలి. నేను అనుకున్న రీతిలో మంచి సినిమా అయితే తీస్తాను. అది ఎంత వసూళ్లు రాబడుతుంది అనేది చూడాలి అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చాడు. కాగా, ప్రభాస్ (Prabhas) చివరి చిత్రం కల్కి 2898 రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. సందీప్ (Sandeep Vanga) చివరగా తీసిన యానిమల్ కూడా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దింతో వీరిద్దరూ కలిసి చేస్తున్న ‘స్పిరిట్’ బాక్సఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తోంది అనేది ఆసక్తికరంగా మారింది.