ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 97 ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నటుడు, నిర్మాత కానన్ ఓ బ్రియాన్ వ్యాఖ్యతగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి హాలీవుడ్ నటీనటులతో పాటు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఉత్తమ సహాయ నటుడితో మొదలైన అవార్డుల ప్రదానోత్సవం ఉత్తమ చిత్రంతో ముగిసింది. అయితే ఈసారి ఆస్కార్ అవార్డుల్లో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అనోరా’ చిత్రానికి అవార్డుల పంట పండింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అనోరా మూవీ అవార్డులను దక్కించుకుంది.
ద బ్రూటలిస్ట్ సినిమాకు గాను ఉత్తమ నటుడుగా అడ్రియన్ బ్రాడీ అవార్డును అందుకోగా.. అనోరా చిత్రానికి గాను మికీ మ్యాడిసన్ ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకుంది. అయితే లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఇండియా నుంచి నామినేటైన ‘అనూజ’కు ఈ సారి నిరాశే ఎదురైంది. ఈ కేటగిరిలో ‘ఐయామ్ నాట్ ఏ రోబో’కి బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ అవార్డు దక్కించుకుంది.
- ఉత్తమ నటుడు: అడ్రియన్ బ్రాడీ (ద బ్రూటలిస్ట్ సినిమా)
- ఉత్తమ నటి: మికీ మ్యాడిసన్ (అనోరా)
- ఉత్తమ చిత్రం: అనోరా
- ఉత్తమ దర్శకుడు: సీన్ బేకర్ ( అనోరా )
- ఉత్తమ సహాయ నటి: జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)
- ఉత్తమ స్క్రీన్‌ప్లే: అనోరా (సీన్ బేకర్)
- ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: డ్యూన్: పార్ట్2
- ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ఫ్లో
- ఉత్తమ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్: ఇన్ ది షాడో ఆఫ్ సైప్రెస్
- ఉత్తమ సహాయ నటుడు – కీరన్ కల్కిన్ (ఏ రియల్ పెయిన్)
- ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే– పీటర్ స్ట్రౌగన్ (కాన్‌క్లేవ్)
- ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – సీన్ బేకర్ (అనోరా)
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – పాల్ టాజ్‌వెల్ (విక్‌డ్)
- ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ – (ఫ్లో)
- ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం- ఇన్ ద షాడో ఆఫ్ ద సైప్రెస్
- ఉత్తమ మేకప్, హెయిల్‌స్టైల్ – ది సబ్‌స్టాన్స్
- ఉత్తమ ఎడిటింగ్ – సీన్ బేకర్ (అనోరా)
- ఉత్తమ సహాయ నటి – జోసల్దానా (ఎమీలియా పెరెజ్)
- ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – ‘ఎల్ మాల్’ (ఎమిలియా పెరెజ్)
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – నాథన్ క్రౌలీ,లీ శాండల్స్ (విక్‌డ్)
- ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్– నో అదర్ ల్యాండ్
- ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా

