బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘ఛావా’. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటించగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించాడు. మహరాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ కొడుకు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా వచ్చింది. విక్కీ కౌశల్ ఇందులో శంభాజీ మహరాజ్ పాత్ర పోషించగా.. ఆయన భార్య యెసుబాయ్ పాత్రను రష్మిక మందన్నా పోషించారు. ఇక ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే విక్కీ కౌశల్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన మొదటి చిత్రంగా ‘ఛావా’ నిలిచింది. ఈ క్రమంలోనే బాక్సఫీస్ వద్ద రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది.
ఈ క్రమంలోనే ఈ ఏడాది ఈ ఘనతను అందుకున్న తొలి సినిమాగా ‘ఛావా’ రికార్డు సాధించింది. కాగా, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్కు రంగం సిద్ధమైంది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై మార్చి 7 నుంచి ‘ఛావా’ తెలుగు వెర్షన్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలోనే 3.08 నిమిషాల నిదివిగల ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మూవీ ట్రైలర్ ను మీరూ చూసేయండి.

