కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన దిల్ రుబా చిత్రం ఫిబ్రవరి 14 న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల అవ్వాల్సిన చిత్రం. అయితే కొన్ని కారణాల వలన ఈ చిత్రం మార్చ్ 14 కు వాయిదా వేశారు
హీరో కిరణ్ అబ్బవరం, ఎక్స్ లో ఈ బైక్ మీదే అంటూ పోస్ట్ చేశాడు. ఆ కధ ఏంటో చూద్దాం.
దిల్ రుబా ఈజ్ అల్ అబౌట్ మై లవ్ అండ్ యాంగర్ అంటున్నాడు హీరో కిరణ్ అబ్బవరం. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ కస్టమైజ్ చేసి తయారు చేసిన బైక్ మీకిచ్చేద్దామనుకుంటున్నా అంటున్నాడు కిరణ్ అబ్బవరం
అయితే దానికి మీరు చేయాల్సిందల్లా దిల్ రుబా నుండి ఇప్పటి వరకు విడుదలైన పాటలు, టీజర్, ఈవెంట్లలో మాట్లాడిన మాటలు బట్టి దిల్ రుబా చిత్ర ప్లాట్ (కధ) ను గెస్’ చేయమంటున్నాడు. ఎవరైతే క్రియేటివ్ గా గెస్ చేస్తారో వారికే ఈ బైక్ అంటున్నాడు
ఎవరైతే ఈ బైక్ గెలుచుకుంటారో వారికి ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బైక్ ను ఇస్తారట. అంతే కాదు, విన్నర్ తో కలిసి ఫస్ట్ డే, ఫస్ట్ షో ఈ బైక్ వెళతారట
ఈ పోటీలో అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరైనా పోటీ చేయవచ్చు. ఇంకెందు ఆలస్యం థింక్ చేయండి. మీ క్రియేటివిటీ కి పదును పెట్టి ఈ సినిమా కోసం వాడిన బైక్ ను సొంతం చేసుకోండి.
ప్రొమోషన్స్ లో కొత్త వరవడి. హీరో నే బైక్ కాంటెస్ట్ నిర్వహించడం అనేది ఇదే మొదటిసారి.

