వైకాపా అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కుటుంబ సభ్యులమీద ప్రెస్ మీట్ పెట్టి, నోటికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన పోసానిని జన సేన నేత ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే
వైకాపా నాయకుడు ఆ తర్వాత ఎఫ్ డి సి చైర్మన్, స్వతహాగా నటుడు, రచయిత, దర్శకుడు ఆయిన పోసాని కృష్ణ మురళి, వైకాపా అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు నాయుడు(Chandrababu) , పవన్ కళ్యాణ్(Pawan Kalyan), లోకేష్ (Lokesh) లను బూతులు తిట్టడం, నోటికొచ్చినట్లు మాట్లాడడం, సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం వంటి అంశాల మీద పోసాని ని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేయగా మొదట్లో సరైన సమాధానం చెప్పకపోయినా ఆ తరవాత సజ్జల రామ కృష్ణా రెడ్డి చెపితేనే చేశానని, స్క్రిప్ట్ అంతా సజ్జల రాసే వారని పోలీసుల విచారణలో పోసాని మురళి చెప్పారు
పోసాని తన నేరాన్ని అంగీకరిస్తూ నేరాంగీకార పత్రం పై సంతకం కూడా చేసినట్లు తెలుస్తోంది. నేరాన్ని అంగీకరిస్తూ పోసాని ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని సజ్జల రామ కృష్ణ రెడ్డి(Sajjala Rama Krishna Reddy) , ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి లు ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని ముందస్తు బెయిల్ కోసం వీరిద్దరూ హై కోర్ట్ ను ఆశ్రయించారు
పోసానికి నటుడుగా పెద్ద అవకాశాలు లేవు ఇప్పుడు. సజ్జల స్క్రిప్ట్ ను పోసాని ఏం ఆశించి చదివారు. ఎఫ్ డి సి చీఫ్ పదవి ఆశించా, లేక డబ్బులు ఆశించా. ఈ చర్యతో సినీ పెద్దలు పోసానిని పక్కన పెడతారా
సజ్జల ఏం ఆశించి పోసానికి స్క్రిప్ట్ ఇచ్చారు. జగన్ మెప్పు పొందడానికేనా లేదా డబ్బులు ఆశించా, లేదా, కొడుకు రాజకీయ అభివృద్ధికా
రాజకీయాలలో నానాటికి విలువలు దిగజారిపోతున్నాయి. అధికారమే పరమావధా, విలువలు కాదా. తప్పు చేసిన వ్యక్తి తో పాటు, తప్పును ప్రోత్సహించిన వ్యక్తులు కూడా దోషులే.ప్రోత్సహించిన వ్యక్తులు కూడా దోషులే.

