బరిలో నితిన్ ‘రాబిన్‌హుడ్‌’ ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ రిలీజ్‌లో ట్విస్ట్

by | Mar 2, 2025 | సినిమా

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నుంచి తాజాగా వస్తున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square). సూప‌ర్ హిట్ సినిమా మ్యాడ్ మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా వ‌స్తుంది. డెబ్యూ యాక్టర్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కాగా, కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంగీత్‌ శోభన్‌, నార్నే నితిన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ పార్టులో శ్రీగౌరి ప్రియా రెడ్డి, అనంతికా సనిల్‌కుమార్‌, గోపికా ఉద్యన్‌ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. కాగా, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

కాగా, ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే వచ్చిన ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ ,టీజర్ లు అభిమానులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే ‘మ్యాడ్ స్క్వేర్’ మార్చి 29న ప్రేక్ష‌కుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా ఈ మూవీ విడుదల తేదీపై చిత్ర బృందం ఓ భారీ ట్విస్ట్ ఇచ్చారు. ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ మార్చి 29న రిలీజ్ కావట్లేదని దానికంటే ఒక రోజు ముందే అంటే మార్చి 28న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందని వెల్లడించారు. మ్యాడ్ స్క్వేర్ కి మొదట ప్రకటించిన తేదీలో అమావాస్య ఉందని డిస్ట్రిబ్యూటర్స్ సెంటిమెంట్ కొరకు ఈ సినిమా విడుదల తేదీని ముందుకు జరిపినట్లు వెల్లడించారు మేకర్స్.

ఇక మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరో నితిన్(NItin), యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో తెరకెక్కిన రాబిన్‌హుడ్‌ (Robinhood) మూవీ కూడా మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. రాబిన్‌హుడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుండగా.. మ్యాడ్ స్క్వేర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానుంది. ఈ రెండు సినిమాలు ఒకే సమయంలో రావడంతో బాక్సాఫీస్ వద్ద పోటీ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.