ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరుగుతోన్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
మొదట బ్యాటింగ్ పారరంభించిన భారత జట్టు మొదటి 3 వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది.
ఓపెనర్ లు రోహిత్ శర్మ 15 పరుగులు, శుభ్ మన్ గిల్ 2 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 300 వ వన్ డే ఆడుతోన్న విరాట్ కోహ్లీ 11 పరుగులు చేసి, ఫిలిప్స్ ఒంటి చేత్తో అందుకున్న అద్భుతమైన క్యాచ్ కు వెనుతిరగాల్సి వచ్చింది.
ఆ తరవాతవచ్చిన శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ లు ఆచి తూచి ఆడుతూ స్కోర్ బోర్డు ను కదిలిస్తున్నారు. కడపటి వార్తలందేసరి భారత జట్టు 19 ఓవర్ల లో మూడు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది
న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ రెండు వికెట్లు, జేమిసన్ ఒక వికెట్ తీసుకున్నారు

