ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగం గా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది
చెరో 22 పరుగులు చేసిన కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్, Matthews ముంబై ఇండియన్స్ జట్టులో టాప్ స్కోరర్స్
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల లో మిన్ను మని, జెస్ జొనాసేన్ మూడేసి వికెట్లు తీశారు. సదర్లాండ్, శిఖా పాండే చెరో వికెట్ తీశారు
124 పరుగుల లక్ష్యంతో ఛేదన ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ శుభారంభం లభించింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, మెగ్ లానింగ్ లో మొదటి వికెట్ కు 85 పరుగులు జోడించారు. 28 బంతుల్లో 43 పరుగులు చేసిన షెఫాలీ వర్మ, అమన్ జ్యోత్ బౌలింగ్ లో అవుట్ అయ్యింది.
ఆ తరవాత వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ తో కలసి మెగ్ లానింగ్ మరో వికెట్ పడకుండా ఢిల్లీ క్యాపిటల్స్ ను ఇంకా 5.3 ఓవర్లు మిగిలి ఉండగానే గెలిపించారు. మెగా లానింగ్ 49 బంతుల్లో 60 పరుగులతో, జెమిమా రోడ్రిగ్స్ 15 పరుగులతో అజేయంగా నిలిచారు

