ఆస్ట్రేలియా, ఆఫ్ఘానిస్తాన్ ల మ్యాచ్ రద్దు, సెమిస్ కు ఆసీస్

by | Feb 28, 2025 | వార్తలు

అనంతరం 274 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా, వర్షం పడే అవకాశాలు ఉండడంతో ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది. 

ఆస్ట్రేలియా 44 పరుగుల వద్ద 20 పరుగులు చేసిన షార్ట్ వికెట్ ఓమర్జాయి బౌలింగ్ లో కోల్పోయింది. 12. 5 ఓవర్ల లో ఒక వికెట్ నష్టానికి 109 పరుగులు చేసినప్పుడు, వర్షం పడడంతో ఆటను నిలిపివేశారు. ఆటను నిలిపి వేసే సమయానికి హెడ్ 59 పరుగులతో, స్మిత్ 19 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. 

మైదానం చిత్తడిగా ఉండడం వలన అంపైర్ లు మ్యాచ్ ను రద్దు చేశారు. మ్యాచ్ రద్దు కావడం తో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఆస్ట్రేలియా సెమి ఫైనల్ కు  అర్హత సాధించింది

అంతకు ముందుటాస్ గెలిచి ఆఫ్ఘానిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.  ఆఫ్ఘనిస్తాన్ సరిగ్గా 50 ఓవర్ ల లో 273 పరుగుల కు అల్ అవుట్ అయ్యింది

ఆఫ్ఘనిస్తాన్ కు మొదటి ఓవర్ లోనే షాక్. ఓపెనర్ గర్భాజ్ డక్ అవుట్ అయ్యాడు. గత మ్యాచ్ సెంచరీ హీరో ఇబ్రహీం జర్దాన్, సెదిఖ్ లు రెండవ వికెట్ కు 67 పరుగులు జోడించాక, 22 పరుగులు చేసిన జర్దాన్ అవుట్ అయ్యాడు

ఆ తరవాత వచ్చిన రహ్మత్ షా 12 పరుగులకే అవుట్ అవడంతో 91 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది

వన్ డౌన్ లో వచ్చిన సెదిఖ్ మాత్రం ఆలా నిలబడిపోయాడు. అతనికి సహకారం ఇచ్చేవారు కరువయ్యారు.  మరో వైపు కెప్టెన్ షాహిదీ 20 పరుగులు చేసి అవుట్ అవగా, నబి ఒక పరుగు చేసి అవుట్ అయ్యాడు.  సెదిఖ్ 95 బంతుల్లో 85 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఒక వైపు వికెట్లు పడుతున్న అజమాతుల్లా ఒమార్జాయి నిలకడగా ఆడుతూ,  రషీద్ ఖాన్ సహకారం తో ఎనిమిదవ వికెట్ కు 36 పరుగులు జోడించారు. 19 పరుగులు చేసి రషీద్ ఖాన్ అవుట్ అవడం తో వీరి భాగస్వామ్యానికి తెర పడింది

ఆ తరవాత వచ్చిన నూర్ తో కలిసి ఒమార్జాయి రెచ్చిపోయాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు.  63 బంతుల్లో 67 పరుగులు చేసిన ఓమర్జాయి  ఇన్నింగ్స్ లో 5 సిక్సర్లు ఉన్నాయి.  ఒమార్జాయి పుణ్యమా అని ఆఫ్ఘానిస్తాన్ పోరాడగలిగే స్కోర్ సాధించింది

ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్ మన్ భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయారు. రెండవ వికెట్ కు 67 పరుగులు, నాలుగవ వికెట్ కు 68 పరుగులే అత్యధిక భాగస్వామ్యాలు.

ఆస్ట్రేలియా బౌలర్ల లో ద్వర్షుయిస్  మూడు వికెట్లు తీయగా, స్పిన్నర్ జంపా, పేసర్ జాన్సన్ లు రెండేసి వికెట్లు తీశారు. మాక్స్ వెల్, ఎల్లిస్ చెరో ఒక వికెట్ తీశారు