ఇటీవల విడుదలై నాగ చైతన్య (Naga Chaitanya) కెరీర్ మొదటి 100 కోట్ల సినిమా గా నిలిచిన సినిమా తండేల్(Thandel). చందూ మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం హైలైట్ అని చెప్పవచ్చు.
మహా శివ రాత్రి కానుకగా ఈ చిత్రంలోని నమో నమశ్శివాయ పాటని విడుదల చేశారు మేకర్స్. ఈ పాటలో సాయి పల్లవి డాన్స్ అక్కటుకుంటుంది. స్వతహాగా డాన్సర్ అయినా సాయి పల్లవి (Sai Pallavi) కి ఇలాంటి పాటలు పడితే ఇంకా ప్రేక్షకులకు, సాయి పల్లవి అభిమానులకు పండగే.

