ప్రభాస్‌- ప్రశాంత్‌ వర్మ మూవీ ఫిక్స్‌.. స్టోరీ లైన్ ఇదే!

by | Feb 26, 2025 | సినిమా

‘హను- మాన్‌’ (Hanuman) చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునన్నాడు యువ దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. (Prasanth Varma). ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) తో ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో భాగంగా ఈ సినిమా రూపొందుండనుండగా.. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్స్ జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది.  ఈ ప్రాజెక్ట్ కోసం త్వరలోనే ప్రభాస్‌ లుక్‌ టెస్ట్‌ చేయనున్నట్లు సమాచారం.  మైథ‌లాజిక‌ల్ మూవీగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ మీద క్రేజీ రూమర్లు కూడా వైరల్ గా మారాయి.

తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ హీరో రణ బీర్ కపూర్ తో ‘బ్రహ్మ రాక్షస్’ అనే సినిమా ప్రశాంత్ వర్మ తీయనున్నట్లు కొద్దిరోజుల కిందట వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ స్టోరీనే ప్రభాస్ కు అనుగుణంగా మార్చేసి తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో రెబల్ స్టార్ అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. మరోవైపు ప్రభాస్‌ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్ లో ‘ది రాజాసాబ్‌’, హను రాగవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమాల షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటుగా మే నుంచి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’ షూటింగ్‌ని మొదలుపెట్టనున్నారట ప్రభాస్‌. ఈ మూడు సినిమాలు పూర్తయ్యాక ప్రశాంత్ వర్మతో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.