పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) క్రేజ్ రోజురోజుకు పెరుగుతోందన్న సంగతి తెలిసిందే. బహుబలి(Bahubali), సలార్, కల్కి వంటి చిత్రాలతో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ నటనకు అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు సైతం అభిమానులుగా మారుతున్నారు. అయితే తాజాగా ప్రభాస్ పేరిట ఒక విలేజ్ ఉందన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు మీద ఓ ఊరు నేపాల్ లో ఉందని తెలిసింది. ఇటీవల చాలామంది తెలుగు వాళ్లు యూట్యూబ్ లో వివిధ ప్రాంతలకు వెళ్లి వీడియోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక తెలుగు యూట్యూబర్ నేపాల్‌లో పర్యటిస్తుండగా అక్కడ ఒక ఊరి పేరు ప్రభాస్ అని రాసి ఉంది. దీంతో అతడు ఈ విషయాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. “నేను ప్రస్తుతం నేపాల్‌లో ప్రభాస్ అనే ఊరిలో ఉన్నాను. మీరు ఎప్పుడయిన ప్రభాస్ అనే పేరుపై ఉన్న ఊరును చూశారా. ఇది మన రెబల్ స్టార్ క్రేజ్ అంటూ వీడియో తీశాడు” ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
నిజానికి ఈ గ్రామానికి మొదటి నుంచి ప్రభాస్ (Prabhas) పేరు ఉందని తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తన ఫెవరేట్ హీరో పేరు మీదట ఏకంగా ఒక ఊరే ఉందని తెలియడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ప్రస్తుతం ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా నటిస్తున్న ‘ది రాజాసాబ్’(The Raja Saab) , ‘ఫౌజీ’ (Fouji) సినిమాల షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో ‘ది రాజాసాబ్’.. ద్వితీయార్ధంలో ‘ఫౌజీ’ సినిమాల విడుదలు కానున్నాయని తెలుస్తోంది. వీటితోపాటుగా మే నుంచి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌నలోనూ ప్రభాస్ పాల్గొననున్నారని సమాచారం.

