‘లవ్ టుడే’ మూవీ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. ‘ఓరి దేవుడా’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించగా.. కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్.గణేశ్, కల్పాతి ఎస్. సురేష్ నిర్మాతలుగా వ్యవహరించారు.. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ మూవీ విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.50 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని హీరో ప్రదీప్ రంగనాథన్ అధికారికంగా ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా.. మా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ మూవీ మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50.22 కోట్ల వసూళ్లు సాధించింది. మా సినిమాను ఇంతలా అందరించిన ప్రేక్షక దేవుళ్ళకు మా హృదయపూర్వక నమస్కారాలు అంటూ ప్రదీప్ ట్వీట్ చేశాడు. ఇక తమ హీరో మూవీ అదిరిపోయే కలెక్షన్స్ సాధిస్తుండటంతో ప్రదీప్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

