WPL : సూపర్ ఓవర్ లో గెలిచిన యూపీ వారియర్స్

by | Feb 24, 2025 | వార్తలు

సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ ఒక వికెట్ నష్టపోయి 8 పరుగులు చేసింది.  ఇందులో వైడ్ లు ద్వారా వచ్చిన పరుగులు రెండు ఉన్నాయి.  అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తరపున స్మృతి మంధన, రిచ్ ఘోష్ బరిలో దిగారు. వీరిద్దరూ కేవలం 4 పరుగులు చేయగలిగారు.  సూపర్ ఓవర్ లో యూపీ వారియర్స్ గెలిచింది

ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో భాగం గా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు, యూపీ వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్ల లో 6 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోర్ సాధించింది

కెప్టెన్ స్మృతి మంధన 6 పరుగులకే అవుట్ అయినా, హాడ్జ్, పెర్రీ లు రెండవ వికెట్ కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు

హాడ్జ్ 41 బంతుల్లో 57 పరుగులు చేసి మెక్ గ్రాత్ బౌలింగ్ లో అవుట్ అయ్యింది. పెర్రీ కేవలం 56 బంతుల్లో 90 పరుగులతో విధ్వంసం సృష్టించింది.  ఇందులో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.  180 పరుగుల రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఇన్నింగ్స్ లో హాడ్జ్, పెర్రీ లు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు

రాయల్ చాలెంజర్స్ కోల్పోయిన  6 వికెట్లలో ముగ్గురు రన్ అవుట్ అయ్యారు. మిగతా 3 వికెట్లను, యూపీ వారియర్స్ బౌలర్ల లో దీప్తి శర్మ, మెక్ గ్రాత్ , హెన్రీ తలా ఒక వికెట్ తీశారు

అనంతరం 181 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన యూపీ వారియర్స్ ధాటిగా ఆడే క్రమంలో,  క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది.  అప్పటివరకు, 31 పరుగులు చేసిన శ్వేతా సెహ్రావాత్ యూపీ వారియర్స్ టాప్ స్కోరర్

అయితే, ఆఖరి ఓవర్లో, రేణుక సింగ్ బౌలింగ్ లో సోఫీ 2 సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టి మ్యాచ్ ను రసవత్తరంగా మార్చింది. 33 పరుగుల సోఫీ ఇన్నింగ్స్ లో నాలుగు సిక్సర్లు ఉన్నాయి.  సోఫీ 19 బంతుల్లో 33 పరుగులు చేసి ఆఖరి వికెట్ గా రన్ అవుట్ అయ్యింది

అయితే సరిగా 180 పరుగులు చేసి యూపీ వారియర్స్ అల్ అవుట్  అయ్యారు.  దీనితో మ్యాచ్ టై గా ముగిసింది.  ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఫలితం కోసం సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది

రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు బౌలర్లలో స్నేహ రానా 3 వికెట్లు, రేణుక సింగ్, గార్త్, రెండేసి వికెట్లు తీశారు. పెర్రీ  ఒక వికెట్ తీశారు