ఛాంపియన్స్ ట్రోఫీ లో న్యూజిలాండ్ సెమీస్ కి, బంగ్లా ఇంటికి

by | Feb 24, 2025 | వార్తలు

ఛాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది

మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ కెప్టెన్ నజముల్ హుస్సేన్ శాంటో 110 బంతుల్లో 77 పరుగులు చేశాడు.  5 వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన జేకర్ ఆలీ 45 పరుగులు చేశాడు.

సీనియర్ ప్లేయర్ లు ముషఫికర్ రహీమ్, మహ్మదుల్లా మరోసారి ఘోరంగా విఫలమయ్యారు

న్యూజిలాండ్ బౌలర్లలో బ్రేస్ వెల్ నాలుగు వికెట్లు తీయగా, ఒరూర్కే రెండు వికెట్లు తీశాడు. జమీసోన్, హెన్రీ చెరో ఒక వికెట్ తీశారు

అనంతరం 237 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ కు మొదట్లోనే పెద్ద దెబ్బ తగిలింది. మొదటి మ్యాచ్ సెంచరీ హీరో విల్ యంగ్, టస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో, ఖాతా తెరవకుండానే  బౌల్డ్ అయ్యాడు 

ఆ తరవాత వచ్చిన డెవాన్ కాన్వే 30 పరుగులు ,విలియమ్సన్ 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు 

72 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ను రచిన్ రవీంద్ర, టామ్ లేధం ఆదుకున్నారు.  వీరిద్దరూ నాలుగవ  వికెట్ కు 129 పరుగులు జోడించారు. 105 బంతుల్లో 112 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర రిషబ్ హుస్సేన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 55 పరుగులు చేసిన టామ్ లేధం రన్ అవుట్ అయ్యాడు. ఆ తరవాత వచ్చిన గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్ వెల్ మరో వికెట్ పడకుండా న్యూజిలాండ్ ను గెలిపించారు.  గ్లెన్ ఫిలిప్స్ 21 పరుగులు,  బ్రేస్ వెల్ 11 పరుగులు చేసి అజేయంగా నిలిచారు

బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, నహిద్ రానా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, రిషబ్ హుస్సేన్ తలా ఒక వికెట్ తీశారు