విభిన్న తరహా పాత్రలు పోషిస్తూ తనకంటూ దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు తమిళ స్టార్ హీరో ఆర్య(Arya). ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ ఎక్స్'(MR X). మనూ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. దేశాన్ని న్యూక్లియర్ ముప్పు నుండి కాపాడటం కోసం గూఢచారులుగా పనిచేస్తున్న కొందరు వ్యక్తుల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తోందని తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను (Teaser) మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే తమిళ టీజర్‌ను విడుదలైన విషయం తెలిసిందే. ‘దేశాన్ని కాపాడటం మన పని మాత్రమే కాదు అది మన బాధ్యత అంటూ ప్రారంభమయ్యే ఈ టీజర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. యాక్షన్ సీక్వెన్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ టీజర్ ను మరింత రసవత్తరంగా మార్చేశాయి. కాగా, భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘మిస్టర్ ఎక్స్’ సినిమాలో గౌతమ్ రామ్ కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్, అనఘా, రైజా విల్సన్, అతుల్య రవి, జయప్రకాష్, కాళి వెంకట్ కీలక పాత్రలు పోషించారు.

