హరి హర వీరమల్లు నుండి ‘కొల్లగొట్టినాదిరో’ పాట విడుదల

by | Feb 24, 2025 | సినిమా

అగ్ర కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఏఎం రత్నం సమర్పణలో మేఘ సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్‌పై ఏ దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో పవర్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథతో పవన్ అభిమానులను అలరించనున్నారు. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, హరిహరవీరమల్లు  మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా  విడుదల కానుండగా… చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో భాగంగా అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్‌ సింగిల్‌ వినాలి వీరమల్లు మాట వినాలి ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలవగా.. తాజాగా సెకండ్ సింగిల్‌ కొల్లగొట్టినాదిరో లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్‌, అనసూయ, పూజిత పొన్నాడ స్టెప్పులేసిన ఈ సాంగ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని అర్థమవుతుంది.ఈ సాంగ్ కి కీరవాణి సంగీతం అందించగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారు.  దీనిని మంగ్లీ, రమ్య బెహరా, యామిని ఘంటసాల, రాహుల్ సిప్లిగంజ్ పాడారు.